16-12-2025 01:17:19 AM
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
మానకొండూర్, డిసెంబరు 15 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచులు అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మానకొండూర్ నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలవగా శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పాటుపడాలన్నారు. ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీరు, విద్యుత్ వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందడం వల్లనే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టంగట్టారన్నారు.
ఇదే హవా మూడో విడత ఎన్నికల్లోనూ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఇల్లంతకుంట, బెజ్జంకి, మానకొండూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, నందగిరి రవీంద్రచారి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీగిరి రంగారావు, ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోపు మల్లారెడ్డి, కుంట రాజేందర్ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, తుమ్మనపల్లి సంధ్య, బి.రాఘవరెడ్డి, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, బుధారపు శ్రీనివాస్, మామిడి అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.