calender_icon.png 14 August, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల కట్టడిలో భాగస్వాములు కావాలి

14-08-2025 02:12:35 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): మాదక ద్రవ్యాల కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్  పిలుపు నిచ్చా రు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా అధికారులు, సిబ్బంది తో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ జీహెచ్‌ఎంసీ కమిషనర్ చేయించారు. మాదక ద్రవ్యాల రహిత భవిష్యత్ భారత్ కోసం ఉద్యోగులు తమవంతు సహకారం అందిస్తామన్నారు.

కమిషనర్ మాట్లాడుతూ.. సమా జ, దేశ అభివృద్ధిలో యువత  పాత్ర ముఖ్యమైనదని అన్నా రు. డ్రగ్ ఫ్రీ ఇండియా ప్రచారంలోనూ యువత ప్రధాన పాత్ర పోషించాలని చెప్పా రు. నగరం, జిల్లా , రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా చేయాలన్న సంకల్పం యువత తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రఘుప్రసాద్, వేణు గోపాల్, పంకజ, గీతారాధిక, ఎగ్జామినర్ ఆఫ్ అకౌం ట్స్ వెంకటేశ్వర్ రెడ్డి, జాయింట్ కమిషనర్ (ఐటీ) రాధ, సీపీఆర్‌ఓ మహ్మద్ ముర్తుజా అలీ, పీఆర్వో దశరథం పాల్గొన్నారు.