14-08-2025 02:13:46 AM
- తోటలో పనిచేసుకుంటూ ప్రాక్టీస్
- విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, ఎండీ విజయరాజంల సహకారం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా గొదం గూడ గ్రామానికి చెందిన రైతు శ్రీశైలంగౌడ్ హైదరాబాద్‌లోని జింఖాన గ్రౌండ్‌లో నిర్వహించిన 1500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్‌మెడల్ సాధించారు. ఆఫ్ సీజన్ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కేవలం 6.01 సెకన్ల
లోనే పరుగెత్తి గోల్డ్‌మెడల్ సాధించాడు. శ్రీశైలంగౌడ్ తోటలో వ్యవసాయ పనులు చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడికి విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, ఎండీ విజయరాజంల సహకారం అందిచండంతో గతంలోనూ అనేక విజయాలు సాధించాడు. అలిఫిట్ నెస్ జిమ్ కోచ్ సద్దాం శిక్షణ ఇచ్చాడు. గతేడాది 10కి.మీ. - 5 కి.మీ.ల పరుగు పందెంలో స్టేట్‌లో రెండవ స్థానం సాధించాడు. జాతీయస్థాయిలో 10 కి.మీ.ల పరుగుపందెంలో మూడవస్థానంలో నిలిచాడు.