calender_icon.png 14 August, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన పరీక్షల అధికారి

14-08-2025 04:34:46 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో గురువారం మొదలైన పీజీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికారి డా. సంపత్ కుమార్(Examination Controller Dr. Sampath Kumar) సౌత్ క్యాంపస్ పరీక్ష కేంద్రాన్ని ప్రిన్సిపాల్ డా. ఆర్ సుధాకర్ గౌడ్ తో కలిసి తనిఖీ చేశారు. నాల్గవ సెమిస్టర్ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా మొత్తం 171 మంది విద్యార్థులకు 169 మంది హాజరయ్యారు. ఇద్దరు గైర్హాజరు అయినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.