29-11-2025 12:00:00 AM
తెలంగాణలో ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది. రేపో, మాపో నోటిఫికేషన్ వస్తుందన్న మాటలకు పుల్ స్టాప్ పడింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఎందరో ఆశావాహులు సర్పంచ్ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఉత్సాహాన్ని, పట్టుదలను పరీ క్షించుకునే సమయం రానే వచ్చింది. కొంత మందికి రిజర్వేషన్లు కలిసి రాక నిరుత్సాహంలో ఉండిపోయారు, అయినా గ్రా మాల అభివృద్ధిలో మంచి నాయకుడికే పట్టం కట్టాలని కసితో యువత ఉన్నారు.
ఏదేమైనా గ్రామాలను అభివృద్ధి చేసి గ్రా మ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్న నాయకుడికే ప్రజలు పట్టం కట్టాల్సిన బాధ్యత ఉంది. యువత కూడా పోటీలో నిలిచి వాళ్ల శక్తి ఏంటనేది చూపించాల్సిన అవకాశం ఏర్పడింది. ఎందుకంటే గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ కాబట్టి గ్రామ ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యతను దక్కించుకోవడం అసలైన విజ యంగా భావించాలి.
గ్రామంలో ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపే వ్యక్తికి, కుల మత భేదాలు లేకుండా కష్టసుఖాలు పాలుపంచుకునే వ్యక్తికి, తన వర్గానికి(పార్టీ పరంగా) అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరికీ సమన్యాయం చేసే వ్యక్తికి, ప్రతిరోజు గ్రామంలో తిరుగుతూ ప్రజల సమ స్యలను తెలుసుకొని పరిష్కరించే వ్యక్తికి, గ్రామమే తన కుటుంబంగా అనుకొని మె లిగే వ్యక్తికి, ప్రభుత్వంతో కొట్లాడి గ్రామానికి నిధులు, పేదలకు రావలసిన పథకాల ను ప్రజల చెంతకు చేర్చే నాయకుడికి ప ట్టం కట్టడం ఉత్తమం.
బల నిరూపణ..
రాజకీయాల్లోకి యువత రావాలని పె ద్ద పెద్ద నాయకులు చెప్తుండే మాట. వీలు చిక్కినప్పుడల్లా ఉపన్యాసాల్లో దంచి చెప్పడమే కానీ కష్టపడ్డ యువ నాయకునికి ప్రతిఫలం మాత్రం శూన్యం.యువతను ప్రోత్సహించి యువతను పట్టించుకోని మంచి హోదాలో రాజ్యమేలుతున్న నా యకులకు వారి బలమేంటనేది చూపించాలి. యువత అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అని చూపించి, పేదల పక్షాన నిరంతరం ఉంటూ ప్రతి పనిని తన పనిగా చేసి ముందుకు వెళ్లి, నేటి యువతకు ఆదర్శంగా మారాలి. యువత తమలో ఉన్న ఉత్సాహాన్ని వెలికితీసి సాధ్యం కానిది ఏది లేదని నిరూపించాలి.
యువతను అన్ని రంగాల్లో అణగదొక్కుతున్న వారికి గెలుపుతో బుద్ధి చెప్పాలి. ఎన్నికల్లో గెలిచాక గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అనే దానిపై ప్రజలకు స్పష్టత ఇచ్చేలా అభ్యర్థులు మేనిఫెస్టోను రూపొందించాలి. మే నిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని హామీలను అమలయ్యేలా చూస్తానని ప్రజల సమక్షంలో ఊరు నడిబొడ్డున హామీపత్రం మీ ద సంతకం చేయాలి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి పారదర్శకంగా ఉంటూనే గ్రామ అభివృద్ధికి ఎలా పాటుపడతాడన్నది ప్రజలు గమనించాల్సిన అవసర ముంది.
ప్రశ్నించే హక్కుకోసం..
ఎన్నికలు వస్తే చాలు ఓటుకు నోటు తప్పనిసరి అయింది. ఎవరు నోటు ఇస్తే వారికే ఓటేయ్యడం ట్రెండ్‌గా మారిపోయింది. కానీ నోటు తీసుకుంటే ప్రశ్నించ లేమన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు తీసుకుంటే గ్రామంలో ఏ సమ స్య ఉన్న గెలిచిన గ్రామ సర్పంచ్‌ను నిలదీసి అడిగే అధికారం ఉండదు. ఎందుకంటే గ్రామస్థాయిలో ప్రతి పనికి సర్పంచ్ అవసరం ఉంటుంది.
ఎమ్మెల్యే,ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకెత్తయితే.. ఈ సర్పం చ్ ఎన్నికలు మరొక ఎత్తు. కావున పైసకు కాదు ప్రాధాన్యం, ప్రశ్నించి సాధించేందుకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోండి. ఓటుకు వచ్చే 500, 1000 రూపాయలకు ఆశపడితే మన జీవితాలు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతాయి. ఏ విషయమైనా నిలదీసి అడగాలంటే ఓటు కు నోటు అనే అంశానికి దూరంగా ఉండా లి. అప్పుడే ఒక సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్‌ను గట్టిగా అడిగే ఆస్కా రం ఉంటుంది.
నిధుల వినియోగం..
ఈ స్థానిక ఎన్నికలు రాబోయే శాసనసభ, సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌లా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే గ్రూప్ రాజకీయాల నియంత్రణ కోసం అధిష్ఠానం బలమైన సమన్వయ కమిటీలను రంగంలోకి దింపింది. బీఆర్‌ఎస్ వ్యూహం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ర్ట సమితి (బీఆర్‌ఎస్) స్థానిక సంస్థల ఎన్నికలను ‘కమ్ బ్యాక్’ వేదికగా ఉపయోగిం చుకోవాలని చూస్తోంది.
పాత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి, బీఆర్‌ఎస్ అధి ష్ఠానం స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల కొత్త ముఖాలను రంగంలోకి దించాలని యోచిస్తోంది. పల్లెల్లో ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు క్యాడర్‌ను కలిగి ఉండడం బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశం. స్థానిక ఎన్నికల్లో నిధుల వినియోగం, అసాధారణ స్థాయి లో పెరిగిపోయిందనడంలో సందేహం లేదు.
ఈ ని ధులే రాజకీయ ‘రిస్క్’ను పెం చడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అభ్యర్థులు పెడుతున్న భారీ కటౌట్‌లు, ఫ్లెక్సీల తయారీకి, గ్రామాల్లో నవరాత్రి/బతుకమ్మ ఉత్స వాలకు ఇచ్చే భారీ విరాళాలు.. ఇవన్నీ ఆశావహుల ఆర్థిక బలాన్ని ప్రదర్శిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ ‘సైలెంట్ మార్కెటింగ్’ కోసం లక్షల్లో నిధులు వినియోగిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు కు గుణాంకాలు పెరిగినట్లే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటు కొ నుగోలు రేట్లు విపరీతంగా పెరగవచ్చనే భయం ఉంది. తమకు టికెట్ దక్కకపోయినా, వేరే పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు గ్రూప్ నేతలకు నిధులు చేరవేయడం వంటి అనైతిక ప్రయత్నాలు జరిగే అవకాశముంది.
కీలకంగా యువత..
తెలంగాణలో యువత ఓటు (18 ఏళ్లు) 35 శాతం పైగానే ఉంది. వారిని ఆకర్షించడానికి క్రీడా పోటీలు, ఇతర సామా జిక కార్యక్రమాలకు భారీగా నిధులు మళ్లిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఒక విధంగా ప్రస్తుత ప్రభుత్వ (కాంగ్రెస్) పని తీరుకు తొలి పరీక్ష. అదే సమయంలో, బీజేపీ తమ బలాన్ని పెంచుకోవడానికి, బీఆర్‌ఎస్ తమ పునాదిని నిలుపుకోవడానికి ఇదే మంచి అవకాశమని చెప్పొచ్చు.
రిజర్వేషన్ల పజిల్, గ్రూప్ రాజకీయాల కుమ్ములాటలు, నిధుల ప్రవాహం, పల్లె ప్రజల ఆకాంక్షలు.. ఇవన్నీ కలిసి స్థానిక ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయి. పల్లె సమరంతో పండుగ జోష్‌ను సంతరించకున్న పల్లెలు ప్రస్తుతం ‘పవర్ పాలిటిక్స్’ అనే రిస్క్ దశకు చేరుకున్నాయి. ఈ రాజకీయ ఉద్రిక్తతకు, ప్రజా తీర్పే విరా మం పలుకుతుంది.
కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు అన్నింటినీ ప్రామాణికంగా తీసు కొని అభ్యర్థికి ఓటు వేయాలా లేదా అన్న ది చూసుకొని ప్రజలు అడుగు ముందుకు వేయాలి. గెలిచిన అభ్యర్థి ఎవరి స్వలాభాల కోసమో కాకుండా ప్రజలకు లాభాన్ని చేకూర్చే విధంగా పని చేయాల్సి ఉం టుంది. అలా ఉంటేనే ప్రతి గ్రామం కూడా సస్యశ్యామలంగా మారుతుంది. ముఖ్యం గా గ్రామాన్ని రాష్ర్టంలో ఒక ఆదర్శ గ్రా మంగా తీర్చిదిద్ది నంబర్‌వన్ స్థాయి లో ఉండేలా చూస్తే అంతకన్నా ఆనందం మరే మీ ఉండదు.
అదే విధంగా ప్రతి గ్రామం లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బా ధ్యత గ్రామ సర్పంచ్‌లపై ఉంది. గ్రామ ప్రజలకు రావాల్సిన పథకాల గురించి అవగాహన కల్పించి, ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రతి సర్పంచ్‌కు ఉం టుంది. కాబట్టి గ్రామల్లోని ప్రజా ఓటర్లు ఆలోచించి అభివృద్ధి చేసే నాయకుడికి, ప్రజల పక్షానికి అండగా నిలబడే నాయకుడికి పట్టం కడితే బాగుంటుంది.
వ్యాసకర్త సెల్: 9949493707