calender_icon.png 7 May, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో గొలుసు రోడ్లకు ఇక మహర్దశ

07-05-2025 12:00:00 AM

రోడ్లకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే విజయరమణారావు 

పెద్దపెల్లి, ఏప్రిల్ 6 (విజయ కాంత్రి) ః నియోజకవర్గంలోని పల్లెల్లో ని గొలుసు రోడ్లకు ఇక ఇక మహర్ధశ పడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామం నుండి నర్సయ్యపల్లి (ఎస్. సి. కాలనీ) వరకు బి.టి రోడ్డు నిర్మాణం కోసం గ్రాంటు సిఆర్ ర్ 2024--25 ద్వారా 2 కోట్ల 40లక్షల రూపాయల నిధులతో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణా రావు శంకుస్థాపన చశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని, ఇందుకోసమే గొలుసు రోడ్లను గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే శివపల్లి నుండి సుల్తాన్ పూర్ రోడ్డును కూడా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు చెడిపోకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.

ట్రాక్టర్ల ద్వారా కేజీ వీల్స్ ను రోడ్లపై నడపవద్దని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి కటింగులు లేకుండా  నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్ళు సాఫీగా జరుగుతున్నాయని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు,  గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.