calender_icon.png 13 August, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ యుద్ధ విమానాలు కూల్చేశాం

10-08-2025 12:00:00 AM

- ఐదు ఫైటర్ జెట్లు సహా పెద్ద విమానం ధ్వంసం చేశాం

- ఎస్ క్షిపణి వ్యవస్థ ఒక గేమ్ చేంజర్

- ‘ఆపరేషన్ సిందూర్’పై వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్-

- బెంగళూరులో ఘనంగా 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ కాత్రే వార్షికోత్సవం

బెంగళూరు, ఆగస్టు 9: ఆపరేషన్ సిందూ ర్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాలు కూల్చేశామని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమ ర్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలు సహా మరో పెద్ద విమానాన్ని కూడా మన సైన్యం 300 కి.మీ దూరంలోనే కూల్చేసిందని తెలిపారు.

జాకోబాబాద్‌లో పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన కొన్ని ఎఫ్ యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయన్నారు. ఈ ప్రక్రియలో ఎస్ క్షిపణి వ్యవస్థ ఒక గేమ్ చేంజర్‌గా  నిలిచిందని కొనియాడారు. ర ష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఎస్‌న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే కీలక విజయం సాధ్యమైందని వెల్లడించారు.

శనివారం బెంగళూరులో జరిగిన 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్‌ఎం కాత్రే మెమోరియల్ సదస్సుకు అమర్‌ప్రీత్ హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన కనీసం ఐదు యుద్ధ విమానాలతో పాటు ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానం ధ్వంసం చేశామన్నారు.

మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం ఒకటని, అక్కడ ఎఫ్‌| హ్యాంగర్ ఉందన్నారు. మన సై న్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతిందని, అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని, అవి తీవ్రంగా దెబ్బతిన్నాయనే అంచనాకు వచ్చామన్నారు. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ.. ఎస్ క్షిపణి వ్యవస్థ సమర్థంగా పని చేసిందని తెలిపారు.

ఈ వ్యవస్థ 400 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉందని, ఆపరేష న్‌లో 300 కి.మీ. దూ రంలో పాక్ విమానాలను కూల్చేశామని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని.. ఇది చాలా హైటెక్ యుద్ధమ న్నా రు. కేవలం 80 గంటల్లోనే తమ లక్ష్యాలను చాలా వరకు సాధించామని తెలిపారు. యుద్ధం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం తప్పదని వారికి అర్థ మైందని, అందుకే కాళ్ల బేరానికి వచ్చారన్నారు.

చర్చలు జరుపుదామని సందేశమి చ్చారని.. దానికి తాము అంగీకరించినట్టు పేర్కొన్నారు. అనంతరం బహవల్పూర్‌లో జెఎమ్ హెచ్‌క్యూ దాడి.. అదే ప్రాంతంలోని జైషే మొహమ్మద్ ప్రధా న కార్యాలయంపై జ రిగిన దాడి ఫోటోలను అమర్ ప్రీత్ ప్రదర్శించారు.

దాడులకు ముందు, దాడులు చేసిన తర్వాత ఆభవనాలు ఎంతలా ధ్వంసమయ్యాయో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఉగ్రస్థావరాలను పక్కాగా టార్గెట్ చేసుకుని జరిపిన దాడుల్లో పక్కనే ఉన్న ఇతర భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నట్టు తెలిపారు. కాగా పాకిస్థాన్ వాయుసేన సామ ర్థ్యానికి జరిగిన నష్టంపై భారత్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.

నోరుపారేసుకున్న పాకిస్థాన్

ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం పాక్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చేసిందంటూ వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ నోరు పారేసుకుంది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. ‘భారత్ చేసిన దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక్క యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదు. మేం అంతర్జాతీయ మీడియాకు వివరాలు వెల్లడించాం. మూడు నెలలుగా ఎలాంటి వాదనలు లేవు. ఇంత ఆలస్యంగా చేసిన వాదనలు నమ్మశక్యంగా లేవు’ అని తెలిపారు.

రాజకీయ అడ్డంకులు లేవు

భారత రాజకీయ నాయకత్వంపై అమర్‌ప్రీత్ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడానికి రాజకీయ సంకల్పమే ప్రధాన కారణమన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు అందాయని, వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. అందువల్ల ప్రణాళికలు వేయడానికి, అమలు చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ లభించిందన్నారు. మూడు సైన్యాల మధ్య పూర్తి సమన్వయం ఉందని, సీడీఎస్ పదవి ఎంతో మార్పు తెచ్చిందని నొక్కి చెప్పారు. అందరిని ఒక చోట చేర్చడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.