calender_icon.png 15 July, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

15-07-2025 12:07:21 AM

 -కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

-అర్హులైన పేదలందరికీ ప్రజా సంక్షేమ పథకాలు

-గజ్వేల్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 

 గజ్వేల్, జులై 14: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం గాంధీభవన్లో జరిగిన గజ్వేల్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు.

  పేదలు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉంటూ పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని,  అంతేకాకుండా గ్రూపులు, వర్గాలు పక్కనపెట్టి పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజ్వేల్ నియోజకవర్గంలో  అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  సీఎం రిలీఫ్ ఫండ్ కింద జిల్లాకు రూ. 900 కోట్లను అందజేసినట్లు స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ  సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తీసుకువెళ్లి స్థానిక సంస్థల్లో  అన్ని స్థానాలలో విజయం సాధించార నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాగనోళ్ళ విజయ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, పరశురాం, ప్రభాకర్ గుప్త,  ఆయా మండలాల బాధ్యులు రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కనకయ్య, లింగారావు, సుఖేందర్ రెడ్డి, మొనగరి రాజు, ప్రణవి రెడ్డి, సారిక రెడ్డి, జ్యోతి కృష్ణ, అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.