calender_icon.png 15 July, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు బాగు

15-07-2025 12:06:20 AM

  1. రంగారెడ్డి జిల్లా పచ్చబడితే రాష్ట్రం పచ్చబడుతుంది

రైతులు భూములు అమ్ముకోకుండా పంటలు వేయండి

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

చేవెళ్ల, జులై 14:ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్ల వరకు లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంటపై రైతులు దృష్టి పె ట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పి లుపునిచ్చారు.  సోమవారం ‘ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్’లో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం లోని పెద్దవీడు గ్రామంలో రైతు సురేందర్ రెడ్డికి చెందిన 20 ఎకరాల పొలంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ డా.పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మొక్కలు నా టారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మా ట్లాడుతూ... రంగారెడ్డి జిల్లా పచ్చబడితే తెలంగాణ మొత్తం పచ్చబడుతుందని, జిల్లాలోని రైతులెవరూ భూములు అమ్ముకోకుండా పంటలు వేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగవుతోందని, ఈ సంవత్సరం మరో 3 వేల ఎకరాలకు పెరగాల న్నారు. కంపెనీ ప్రతినిధులే తోటకు వచ్చి పంటను సేకరిస్తారని, ధర, రవాణా వంటి ఇబ్బందులు కూడా ఉండవని చెప్పారు.

దేశానికి వంద లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ అవసరం ఉంటే ప్రస్తుతం 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పండిస్తున్నామన్నారు. ఇతర దేశాల నుంచి లక్షన్నర కోట్లు పెట్టి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, ఇక్కడే పండిస్తే ఆ డబ్బులు రైతులే సంపాదించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగుకు వీలుందని.. కనీ సం 10 లక్షల నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట వేసినా దేశానికి ఆయిల్ సరఫరా చేయవచ్చన్నారు.

రానున్న రెండు, మూ డేళ్లలో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో పది ఫ్యాక్టరీలను నిర్మించనున్నామని, ఇందుకోసం పూర్తి అనుమతులు పొం దామని వివరించారు. వచ్చే నెలలో సిద్ధిపేటలో ఆయిల్ పా మ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.  పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా, రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని కొనియాడారు. జిల్లాలో 2 .83 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ. 323 కోట్ల రైతుభరోసా, 1.4 లక్షల మంది రైతులకు రూ.747 .41 కోట్ల రుణ మాఫీ అమలు చేశామని స్పష్టం చేశారు.

సర్దార్ నగర్ మార్కెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఉద్యానవన, పట్టు పరిశ్రమల డైరెక్టర్ యస్మిన్ బాషా, జా యింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి,  జిల్లా అధికారి సురేష్, వాల్యు ఆయిల్ ఎండీ రామకృష్ణ, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల, సర్దార్ నగర్ ఏ ఎంసీ చైర్మన్లు పెంటయ్య గౌడ్, పీసరి సురేందర్ రెడ్డి, ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ ఫాబాద్ దర్శన్, హార్టికల్చర్ డివిజన్ ఆఫీసర్ కీర్తి కృష్ణ, ఏ వోలు , ఏఈవోలు, రైతులుపాల్గొన్నారు.