calender_icon.png 28 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ఎమ్మెల్యే యెన్నం

28-11-2025 12:00:00 AM

మహబూబ్‌నగర్, నవంబర్ 27 (విజయక్రాంతి): జామియా మజీద్, వక్స్ -ఎ-రహెమానియా ఈద్గా నిర్వాహణ నూతన కమిటీ సభ్యులు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ  జామియా మజీద్ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పన కోసం రూ.1 కోటి 50 లక్షలు, ఈద్గా  అభివృద్ధికి మరో రూ.1 కోటి 50 లక్షలు కేటాయించామని తెలిపారు. ప్రార్థనా స్థలాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.   దేవుడిని ప్రార్థించే చోట అందరికీ అవకాశం కల్పించాలనే ఉంద్దేశం తో నూతన కమిటీలలో 90 శాతం కొత్తవారికి అవకాశం కల్పించామని, అందులో విద్యావంతులు, అనుభవజ్ఞులు, భక్తి-శ్రద్ధలు కలిగిన వారిని ఎంపిక చేసి పూర్తిగా పారదర్శక విధానంలో కమిటీ ఏర్పాటు జరిగిందన్నారు.

రెండు సంవత్సరాల పాటు కొనససాగనున్న ఈ కమిటీలు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల్లో భక్తిని పెంపొందించడం, మహబూబ్ నగర్లో సోదరభావాన్ని మరింత బలపరచడం ఈ కమిటీల ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని నూతన కమిటీలు విజయవంతంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ , హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సాదుల్లా, ఈద్గా కమిటీ అధ్యక్షులు రిటైర్డ్ డీఎస్డిఓ మహ్మద్ బషీరుద్దీన్, ఉపాధ్యక్షులు ఖాజా భియాముద్దీన్ , కార్యదర్శి అబ్దుల్ వహీద్ ఖాన్ దురాని, సంయుక్త కార్యదర్శి మహ్మద్ జుల్ఫికర్‌అలీ, కోశాధికారి ఖాదర్ మొహియోద్దీన్, సభ్యులు అబ్దుల్ మోసీన్, భాజా హస్నోద్దీన్, ఖాజపాష,

మహ్మద్ తాజుద్దీన్, డాక్టర్ మీర్ ముజమిర్ ఆలీ, మహ్మద్ ఫరీద్ లు  జామీయ మజీద్ కమిటీ అధ్యక్షులు  సయ్యద్ అమీనుద్దీన్ ఖాద్రీ, ఉపాధ్యక్షులు  ఫహిమ్ సిద్ధిఖీ, కార్యదర్శి ఎంఎ. మజీద్, కోశాధికారి  మజీద్ ఖాన్, సభ్యులు సయ్యద్ మసూద్ మొహియుద్దీన్, మహ్మద్ ముక్తార్ అహ్మద్, సయ్యద్ ఆఫ్టల్, సమీముద్దీన్ ఖాన్, ఫజలుర్ రహమాన్, జహంగీర్ పాష ఖాద్రీ, మహ్మద్ ముస్తాక్  పాల్గొన్నారు.