calender_icon.png 7 September, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచులను గోస పెడుతున్నారు..

16-12-2024 10:40:02 AM

హైదరాబాద్: ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా సర్పంచులను గోస పెడుతున్నారని, గవర్నర్, మంత్రులను కలిసి సర్పంచులు మొరపెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. తెలగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... చలో అసెంబ్లీ చేపడితే నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఏడాదిగా పల్లె, పట్టణ ప్రగతి కింద గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా బీఆర్ఎస్ నిలిపిందన్నారు. రూ. 691 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం, ఈజీఎస్ నిధులను మళ్లించారని హరీశ్ రావు తెలిపారు. కక్షతో సర్పంచులను ఇబ్బందులు పెడుతన్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలోపు బిల్లులు చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.