25-11-2025 04:49:28 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): జిల్లాలో రెండవ అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మూసిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, మూసీ గెస్ట్‌హౌస్‌ను పునరుద్ధరణ చేపడుతామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మంగళవారం కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టులో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టులో 19 లక్షల చేపపిల్లలను విడిచినందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నకిరేకల్ నియోజకవర్గంలోని చెరువులకు మొత్తం కోటి ఐదు లక్షల చేపపిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మూసీ ప్రాజెక్ట్ ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం బోటింగ్ సౌకర్యం కూడాఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. మూసీలో వ్యర్థ పదార్థాలు పారబోతే ప్రభుత్వ నియమాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తామంజుల మాధవ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మూసీ ప్రాజెక్ట్ డి.ఇ. చంద్రశేఖర్, ఏ.ఇ. మధు, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్లు వెలుగు రవి, మెరుగు వెంకన్న, చనగాని వీరయ్య, మూసి మత్స్యశాఖ పాలకవర్గ సభ్యులు అల్వాల వెంకటస్వామి, సాదుల నరసయ్య, కొరివి యాదగిరి, రావుల వీరయ్య, ఈదుల యాదగిరి, అల్లి సైదులు, లక్ష్మయ్య, బత్తిని సైదులు, కనుగు వెంకటనారాయణ, మాదలక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్దే లక్ష్యం
9 కోట్ల 10 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు
గ్రామాల అభివృద్ది చేయడమే తమ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. మంగళవారం నకిరేకల్ మండలంలోని, నోములలో 10 లక్షల వ్యయంతో సిసి రోడ్లు, డ్రైనేజీకి, పాలెంలో 10 లక్షలతో సి.సి రోడ్లు, ఒగోడులో 15 లక్షలతో సిసి రోడ్లకు, కడపర్తిలో 20 లక్షలతో ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంకి 10 లక్షలతో సిసి రోడ్లు, నెల్లిబండలో 3.25 లక్షలతో బీటీ రోడ్లకు చందంపల్లిలో 10 లక్షలతో సిసి రోడ్లకు నేషనల్ హైవే 65 నుండి బైరెడ్డి గూడెనికి సిసి రోడ్డు నిర్మాణానికి మొత్తం 9 కోట్ల 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోగా అభివృద్ధి చేస్తానని తెలిపారు..
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.ధాన్యం కొనుగోలు పై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అధికారులకు ఫోన్ చేసి త్వరగతిన సేకరణ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసు పాదం, వివిధ గ్రామాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.