25-11-2025 04:46:03 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే, కుంగ్ ఫు పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు సాధించారు. ఈనెల 22న పెద్దపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే, కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఏ తరుణ్, వి మనోబిరామ్ బంగారు పథకాలు సాధించగా జి ధనుష్, ఎం. సంచిత్, పి అభిరామ్ రజత పథకాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు మంగళవారం విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ కనకేష్, విద్యార్థులు పాల్గొన్నారు.