calender_icon.png 24 October, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం

24-10-2025 12:16:39 AM

-ఎక్స్ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ 

-ఆసియన్ సమ్మిట్‌లో వర్చువల్‌గా పాల్గొననున్న మోదీ

-భారత్ తరఫునప్రతినిధి విదేశాంగ మంత్రి హాజరు

-ప్రధాని వెళ్లకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు

-26 నుంచి మలేషిసియాలో ఆసియన్ సదస్సు

న్యూఢిల్లీ, అక్టోబర్23: ఈ నెల26 నుంచి 28 వరకు మలేసియా రాజధానిలో జరగనున్న ఆసియన్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొంటారు. గురువారం మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ విషయాన్ని తెలియజేశారు. ఆసియాన్- భారత్ సమగ్ర వ్యూహా త్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎదురు చూస్తున్నామని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, ఆసియాన్ భాగస్వామి దేశాల నాయకులను సమావేశాలకు హాజరు కావాలని మలేషియా ఆహ్వానించింది. ఇందుకోసం ట్రంప్ ఈ నెల 26న రెండు రోజుల పర్యటన కోసం కౌలాలంపూర్‌కు వెళ్లనున్నారు.

ఇదిలా ఉండగా, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ చేతిలో చిక్కుకోవడం ప్రధాని మోదీకి ఇష్టం లేకపోవడం వల్లే కౌలాలంపూర్ వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన ఎక్స్ పోస్టులో పెట్టారు. ‘చాలా రోజులుగా ఈ సదస్సుకు మోదీ వెళ్తారా.. లేదా? అనే దానిపై ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు వెళ్లడం లేదని తేలిపోయింది. అంటే, ప్రపం చ నేతలను ఆలింగనం చేసుకొని ఫొటో తీసుకోవడంతో పాటు, తనని తాను విశ్వగురువుగా చాటుకొనే అవకాశాన్ని మోదీ కో ల్పోయారు. మోదీ ఈ సదస్సుకు వెళ్లకపోవడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అక్కడ ఉండటమే. కొన్ని వారాల క్రితం ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సమావేశానికి కూడా మన ప్రధాని హాజరు కాలే దు’ అంటూ జైరాం విమర్శలు గుప్పించారు.