24-10-2025 12:14:42 AM
-మారనున్న బ్యాంకు నిబంధనలు
-నవంబర్ 1 నుంచి కొత్త నామినేషన్ రూల్స్
-ఖాతాదారులు నలుగురు వరకు నామినీలను నియమించుకునే అవకాశం
-నామినీలకు ఎంత వాటా ఇవ్వాలో కూడా నిర్ణయించుకునే వెసులుబాటు
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అం దించింది. నవంబర్ 1 నుంచి ఖాతాదారులు వారి ఖాతాలకు ఒకేసారి లేదా వరుసగా నలుగురిని నామినేట్ చేయవచ్చు. అలాగే డిపాజి ట్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లకు సంబంధించిన నామినేషన్ సౌకర్యాలలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఈ కొత్త విధానం నవం బర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం 2025లో భాగంగా ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు.
దీని ప్రకారం బ్యాంకు డిపాజిట్లకు నామినీలను రెండు విధాలుగా నియమించుకునే అవకాశం కల్పించారు. ఖాతాదారులు తమకు నచ్చిన విధంగా నలుగురు నామినీలకు ఒకేసారి లేదా ఒకరి తర్వాత మరొకరికి ప్రయోజనం అందేలా ఎంచుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లోని సేఫ్ కస్టడీ వస్తువులకు, సేఫ్టీ లాకర్లకు మాత్రం ఒకరి తర్వాత మరొకరు అనే పద్ధతిలోనే నామినేషన్ చేసుకునేందుకు అనుమతి ఉం టుంది.
మరో ముఖ్యమైన సౌలభ్యం కూడా ఉంది. నలుగురు నామినీలను ఎంచుకున్నప్పుడు, ఎవరికి ఎంత వాటా (శాతం) చెందా లో కూడా ఖాతాదారులే ముందుగా నిర్దేశించవచ్చు. అయితే, మొత్తం వాటాలన్నీ కలిపి 100 శాతానికి సమానంగా ఉండాలి. ఈ నిర్ణ యం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్ సెటిల్మెంట్లు చాలా సుల భంగా, పారదర్శకంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.