calender_icon.png 24 January, 2026 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్రా పార్టీల పెత్తనం సాగనివ్వం

24-01-2026 01:23:42 AM

  1. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకుందాం
  2. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు ఇక్కడ ఏం పని?
  3. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ

మేడ్చల్, జనవరి 23 (విజయక్రాంతి): అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న  తెలంగాణను మళ్లీ వెనక్కి పోనివ్వబోమని, మన అస్థిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు అల్లం నారా యణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనదని, తెలంగాణ మనదని స్పష్టం చేస్తూ ఇక్క డ మళ్లీ ఆంధ్రా నాయకుల చక్రాలు తిప్పడం సాగదని హెచ్చరించారు.

శుక్రవారం సూరారంలో కుత్బుల్లాపూర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారణ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటి నా యకులకు తెలంగాణలో ఏం పని ప్రశ్నించారు. మనకు మనదైన సినీ ప్రపంచం, సం స్కృతి ఉన్నాయని, మళ్లీ వచ్చి మాపై రుద్దడమేమిటని మండిపడ్డారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని, ఇక్కడి వనరులపై, సంప్రదాయాలపై ఇతరుల ఆధిప త్యాన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ స్వభావాన్ని కో ల్పోతే మన ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పార్టీలన్నీ విడిపోయి ఉన్నా, తెలంగాణ కోసం అందరినీ ఏకం చేసిన ఘనత మన ఉద్యమానికి ఉందని గుర్తు చేశారు. ‘తెలంగాణ వనరులను దోచుకున్న వారిని హీరోలుగా పొగడడం, ఎన్టీఆర్ వంటి వారిని ఇక్కడ కీర్తించడం భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. దీనిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలి అన్నారు.

యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్, టెంజు రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు  కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివాజీ,  ఐజేయు కమిటీ సభ్యులురంగు వెంకటేష్ గౌడ్, మేడ్చల్ ఇన్చార్జి బొమ్మ అమరేందర్,  జిల్లా అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలెపాక వెంకట్,, సీనియర్ జర్నలిస్టులు సుధీర్, ముక్కెర్ల లాలయ్య, లింగ స్వామి, రామకృష్ణారెడ్డి, సురేందర్,   సింగిరెడ్డి కృష్ణారెడ్డి, అధ్యక్షులు సుగ్రీవుడు, ప్రధానకార్యదర్శిగా మాధవరెడ్డి, కోశాధికారి ఎర్రోళ్ల బాబు, కళ్యాణ్, శోభన్, టెంజు కన్వీనర్ ఎర్రోళ్ల కృష్ణ, కో - కన్వీనర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.