24-01-2026 01:23:32 AM
మధుసూదన్‌రెడ్డిపై ఏసీబీ కేసు
రూ.7.83 కోట్లకు మించి ఆస్తుల గుర్తింపు
కుషాయిగూడ, జనవరి 23 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌రి జిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ 1)గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్‌రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు నమోదైంది. భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నివాసంతో పాటు బం ధువులు, స్నేహితులు, బినామీలు, సహచరులకు చెందిన మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏసీ బీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మేడ్చల్ జిల్లా కాప్రా, ఈసీఐఎల్ పరిధిలోని భవానీ నగర్ కాలనీలో 300 చదరపు గజా ల విస్తీర్ణంలో నిర్మించిన ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ భవనం, ఇబ్రహీంపట్నం చింతప ల్లిగూడ గ్రామంలో ఓపెన్ ప్లాట్, పరిగి మం డలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, మంగల్‌పల్లి గ్రామంలో ఎక రం వాణిజ్య భూ మిని గుర్తించారు. పరిగి మండ లం నస్కల్ గ్రా మంలో స్విమ్మిం గ్ పూల్ ఉన్న ఫాంహౌస్ (రూ. 1.24 కోట్ల విలు వ) గుర్తించారు.
రూ.9 లక్షల నగ దు, 1.2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీ నం చేసుకున్నారు. మూడు విలాసవంతమైన కార్లు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తిం చిన స్థిర, చర ఆస్తుల విలువ సుమారు రూ.7.83 కో ట్లుగా అధికారులు అంచనా వేశారు. ఇంకా ఆర్ ఏఆర్‌కే స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు, భార్య, పిల్లల పేర్లతో రెండు షెల్ కం పెనీలు ఏర్పా టు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. అదనపు ఆస్తులపై తనిఖీలు కొనసా గుతుండగా, కేసు దర్యాప్తు దశలో ఉందని అధికారులు తెలిపారు.