calender_icon.png 9 January, 2026 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీలపై ఫారెస్ట్ శాఖ జులుం సహించం

06-01-2026 12:44:40 AM

ఆదిలాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): రెవెన్యూ భూమిలో ఫారెస్ట్ అధికారుల పెత్తనం ఏంటని? కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ శాఖపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఇండ్ల నిర్మాణం అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరిగేలా చూడాలని సీపీఎం సీనియర్ నేత ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు.

సోమవారం  సాత్నాల మండలం దుబ్బగూడ కోలాం ఆదివాసీల నిరాహార దీక్షలు మూడవ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే లు ఎందుకు ఆదివాసీలకు అండగా ఉండడం లేదని వారి పక్షాన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మంజుల, స్వామి, రామన్న, ఆదివాసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.