calender_icon.png 30 September, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే

30-09-2025 12:55:57 AM

తాండూరు, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) : ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు సంక్షేమ పథకాలు  ఆపబోమని ఎన్ని నష్టాలు వచ్చినా కూడా పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు.

సోమవారం ఆయన పెద్దెములు మండలం మంబాపూర్ లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి దారులు సునీత అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేసి పాలు పొంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి తోపాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి అధికారులు స్థానిక నాయకులతో కలిసి భోజనం చేశారు .