calender_icon.png 30 September, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

30-09-2025 12:57:10 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : ఉమ్మడి ఘట్ కేసర్ మండల ప్రజలు సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతాలలోని కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మలను పెట్టి ఆటపాటలతో అలరించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామాలలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.

విధ్యుత్ లైటింగ్, డీజీఏ సౌండ్ సిస్టంలతో పాటు బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లను చేశారు. ఆయా ప్రాం తాలలో మహిళలు, యువతులు బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని ఆటాపాటలతో హోరెత్తించారు. మహిళలతో పాటు స్థానిక నాయకులు బతుకమ్మ ఆటాడి చూపరులను సంతోషపరిచారు. గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని ఈ బతుకమ్మ సంబురాలను తిలకించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

కందుకూరు

కందుకూరు సెప్టెంబర్ 29 : దసరా ఉత్సవాల్లో భాగంగా బతుకు నిచ్చే బతుకమ్మ పండుగను మహిళలు అంగరంగ వైభవంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ప్రతి గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. మహి ళలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా రామ రామ రామ ఉయ్యాలో... రామనే శ్రీరామ ఉయ్యాలో...

అంటూ పలు గీతాలు సాగిస్తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ గ్రామ గ్రామాల్లో దేవాలయాల ముందు ఉంచు తూ ఆట పాటలతో సద్దుల బతుకమ్మ చివరి రోజున బతుకమ్మను సాగనంపి అమ్మ నీవు బతుకు నిచ్చే అమ్మవు నీవు వచ్చే ఏడాది మాకు ఇప్పటిలాగే సకల సౌభాగ్యాలు  కల్పించాలని కోరుతూ బతుకమ్మను ఆయా గ్రామాల్లోని చెరువులు,కుంటలు,నదులలో నిమజ్జనం చేసి బతుకమ్మ దీవెనలు మహిళలు పొందారు.

బతుకమ్మకు ఆటపాటలతో నీరాజనాలు పలుకుతూ మహిళలు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.9వ రోజు బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మ నామ కీర్తితో అమ్మవారిని కొలచి దేదీప మాన్యంగా పసుపు,కుంకుమ,చందనాలతో పువ్వులతో నిండుగా అలంకరించి కొలిచారు.