28-07-2025 06:31:51 PM
సిహెచ్ఓ చరణ్ నాయక్..
నూతనకల్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిహెచ్ఓ చరణ్ నాయక్(CHO Charan Nayak) అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారీ వర్షాల కారణంగా తమ ఇంటి పరిసరాలలో వర్షపు నీరు నిలువ ఉండడం వలన దోమలు వ్యాప్తి చెంది అవి కుట్టడంతో మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వ్యాపించి రోగాల బారిన పడతారని ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు నాయక్, జ్యోతి, పుష్ప, నగేశ్, సీతారాం రెడ్డి, ఆశాలు, ఉపాద్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.