calender_icon.png 30 September, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ ఆలయాలకు పూర్వవైభవం తెస్తాం

30-09-2025 12:33:08 AM

  1. రూ. 345 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు 

జోగులాంబపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి 

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 

అలంపూర్ ,సెప్టెంబర్ 29: రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం జోగుళాంబ ఆలయాలకు పూర్వ వైభవం తెస్తామని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని దేవాదాయశాఖ మంత్రి కొం డా సురేఖ తెలిపారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎమ్మెల్యే విజయుడుతో కలిసి సమర్పించారు.

అనంతరం జోగులాంబ దేవి బాల బ్రహ్మేశ్వర స్వామి క ళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నా రు. అంతకు ముందు మంత్రికి ఆలయ ఈవో దీప్తి, పాలకమండలి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...

జోగులాంబ అమ్మవారి ఆలయాలను రూ.345 కోట్ల రూపాయలతో మూడు విడతలుగా అభివృ ద్ధి చేయనున్నట్లు తెలిపారు.మొదటి దశలో రూ.32 కోట్ల రూపాయలతో ఆలయ సుం దరీ కరణ.. రెండవ దశలో రూ.24 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి మూడవ దశలో రూ.345 కోట్లతో ఆలయాలను మొ త్తం అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

శక్తి పీఠాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి పే ర్కొన్నారు. గద్వాల సంస్థాన వంశీయులు కృష్ణ రాంభూపాల్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. వారి వం శీయులు ఒకరిని జోగులాంబ ఆలయ ట్రస్టులుగా ఉంచి ఆలయ అభివృద్ధి చేసే విధంగా ప్రోత్సహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకురాలు సరిత, ఆలయ ధర్మకర్తలు, విశ్వనాధ రెడ్డి జగన్మోహన్ నాయుడు, జగన్ గౌడ్ పాల్గొన్నారు.