30-09-2025 12:31:31 AM
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, సెప్టెంబర్ 29: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఖరారైన రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకొని ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ఐదు మంది సభ్యులతో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి ఎన్నికల సలహా (అడ్వైజరీ) కమిటీలను నియమించడం జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కమిటీల వివరాలను ఎమ్మెల్యే వివరించారు.
నియోజకవర్గ స్థాయి సలహా కమిటీ లో సభ్యులుగా అశోక్ యాదవ్, బుక్కా వెంకటేశం,నిత్యానందం, సర్ఫరాజ్, చౌటు యాదయ్య ను ఎంపిక చేసామని చెప్పారు. జడ్చర్ల రూరల్ మండల సలహా కమిటీ లో సభ్యులుగా బూర్ల వెంకటయ్య, గంగాపురం జనార్ధన్ రెడ్డి, రాజు గౌడ్ , లింగంపేట్ తిరుమల్ రెడ్డి, కొండేడ్ రవి ని ఎంపి క చేసామని తెలిపారు.
మిడ్జిల్ మండల సలహా కమిటీలో షభ్యులుగా అల్వాల్ రెడ్డి, సాయిలు, వెంకటయ్య, మల్లికార్జున్ రెడ్డి, గౌస్, ఊర్కొండ మండల సలహా కమిటీ సభ్యులుగా వెంకటయ్య గౌడ్,తిరుపతి రెడ్డి, అయ్యూబ్ పాషా, మనోహర్ రెడ్డి, రమేష్ నాయక్ ను ఎంపిక చేసామన్నారు.
నవాబుపేట మండల సలహా కమిటీ సభ్యులుగా రామచంద్రయ్య, కారుకొండ భూపాల్ రెడ్డి, కూచూరు సురేష్, తులసీరామ్ నాయక్, రేకులచౌడాపూర్ శర్మ, రాజాపూర్ మండల సలహా కమిటీ సభ్యులుగా ఖానాపూర్ శేఖర్ గౌడ్, శీను నాయక్, కల్లేపల్లి శ్రీశై లం, చొక్కంపేట లక్ష్మయ్య, రమేష్ రెడ్డి, బాలానగర్ మండల సలహా కమిటీ సభ్యులుగా శంకర్ నాయక్, ఆదిత్యారెడ్డి, దత్తు, గుండేడ్ నర్సింహారెడ్డి, నందీశ్వర్లను ఎంపిక చేసినట్లు అనిరుధ్ రెడ్డి వివరించారు.
మండల స్థాయి సలహా కమిటీలలోని సభ్యులు తమ పరిధిలోని గ్రామ కాంగ్రెస్ కమిటీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో చర్చించి ఇందిరమ్మ కమిటీల సభ్యులతో సమన్వయం చేసుకొని, వారి సంతకాలు తీసుకొని, రిజర్వేషన్ల ప్రకారంగా ఆయా స్థానాలలో ఒక్కొక్క స్థానానికి ఇద్దరు అభ్యర్థులకు తగ్గకుండా బలమైన అభ్యర్థుల పేర్లను సూచించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆయా స్థానాలకు తాము సూచించిన అభ్యర్థుల పేర్లతో కూడిన నివేదికను మండల సలహా కమిటీలు ని యోజకవర్గ సలహా కమిటీలకు అందించాలని చెప్పారు. నియోజకవర్గ సలహా కమిటీ మండలాల నుంచి తమకు అందిన నివేదికలపై అందరితో చర్చించి అవసరమైతే ఆయా మండలాలను సందర్శించి, మండల సలహా కమిటీలు ఇచ్చిన నివేదికలను సరిచూసుకొని నియోజకవర్గ స్థాయి నివేదికను తయారు చేయాలని అనిరుధ్ రెడ్డి సూచించారు.
నివేదికను ఎమ్మెల్యే గా తనతో పాటుగా డీసీసీ, పీసీసీలకు సమర్పించాలని వివరించారు. మండలస్థాయి సలహా కమిటీల నివేదికలు నియోజకవర్గ కమిటీకి అక్టోబర్ 5 వ తేదీ లోపుగా సమర్పించాలని, అలాగే నియోజకవర్గ స్థాయి సలహా కమిటీ తన నివేదికను అక్టోబర్ 7 వ తేదీ లోపుగా సమర్పించాలని కోరారు. ఈ గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబడదని ఎమ్మెల్యేతెలిపారు..