calender_icon.png 18 October, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న బంద్‌తో బీసీల తడాఖా చూపిస్తాం

18-10-2025 01:47:09 AM

బీసీ జేఎసి  సమావేశంలో నిర్ణయం

కామారెడ్డి, అక్టోబర్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  ఆర్, అండ్ బి, గెస్ట్ హౌస్ లో శుక్రవారం జరిగిన అఖిలపక్ష బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ శనివారం 18న  జరగబోయే బీసీ జేఏసీ బంద్ లో సబ్బండ వర్గాలు పాల్గొని బంద్ ని విజయవంతం చేయాలని వారు కోరారు. విద్యా, కిరాణా, వాణిజ్య, వర్తక, ఆటో సంఘాలందరినీ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు.

జిల్లా లోని అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించి గ్రామ స్థాయి నుండి జిల్లా వరకు నిరసనలు తెలిపి బీసీ ల ఐక్యత చాటాలన్నారు.అదనపు కలెక్టర్, డీఈఓ, NGO, TNGO, సంఘాల జిల్లా అధ్యక్షులకు మద్దతు కోరుతూ వినతిపత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. మెమెంతో మాకంత అనే నినాదంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో సాధించే వరకు నిరంతరం ఉద్యమిస్తామని వారు తెలిపారు,ఈ బంద్ ధ్వారా బీసీ ల సత్తా ఏందో ఢిల్లీకి షెక  తగిలేలా నిరూపిస్తామని పేర్కొన్నారు.

శనివారం బంద్ కోసం ఉద్యమ స్ఫూర్తి తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీజేఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్, ప్రజాపంత్, Lhps నాయకులు పాల్గొని విజయవంతం కోసం ప్రణాళికా రచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నీల నాగరాజు ముదిరాజ్, కుంబాల లక్ష్మణ్ యాదవ్, శివరాములు, పండ్ల రాజు, కుంబాల రవి, నాగరాజ్ గౌడ్, మార్కంటి భూమన్న, కొత్తపల్లి మల్లన్న, గైని శ్రీనివాస్ గౌడ్, కన్నయ్య, గణేష్ నాయక్, చింతల శంకర్, బాను, రాజయ్య, సాయికృష్ణ, రాజీవ్, రాజేందర్, గోవర్ధన్, ఎల్లయ్య పాల్గొన్నారు.