calender_icon.png 14 August, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తాం

11-08-2025 01:03:37 AM

- ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు  

- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 

- వికలాంగుల ఉద్యోగులతో త్వరలోనే భారీ సభ 

- వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య 

 హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య నేతృత్వంలో వికలాంగులు, ఉద్యోగలు ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పేదలు, వికలాంగుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు ముం దుంటుందని, కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని తెలిపారు.

వికలాంగుల ఉద్యో గులకు బదిలీల్లో రిజర్వేషన్లు కల్పించడం హ ర్షనీయమని వికలాంగుల కార్పొరేషన్ చైర్మ న్ ముత్తినేని వీరయ్య అన్నారు. వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రె డ్డి, మంత్రి అడ్లూరికి వికలాంగులు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో వికలాంగులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. త్వరలోనే వేలాది మంది వికలాంగులు ఉద్యోగులతో కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ముత్తినేని వీరయ్య తెలిపారు.