11-08-2025 01:05:08 AM
- నియామకపత్రాలు అందజేసిన మాజీ హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్ మైనార్టీ కమిటీని ఎన్నుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఇన్‌చార్జి కార్తీక్ రెడ్డి వీరికి నియామక పత్రాలు అందజేశారు. మైనార్టీ అధ్యక్షుడిగా సయ్యద్ ముస్తఫా, వైస్ ప్రెసిడెంట్లుగా గులాబ్ అసత్, సత్తార్ ఖాన్‌లను ఎన్నుకున్నారు.
నార్సింగ్ మున్సిపాలిటీలోని వివిధ గ్రామాల నుంచి సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో వర్కింగ్ కమిటీ మాజీ మెంబర్ నిజాముద్దీన్, మాజీ సర్పంచ్ ముత్యాలు. కో ఆప్షన్ మెంబర్ మహమూద్, మాజీ వార్డు సభ్యులు మల్లేశ్, నాయకులు యాదగిరి, నరసింహ, గణేశ్ ముదిరాజ్, గణేశ్‌రెడ్డి, మైపాల్, సర్వర్ ఇమ్రాన్ భాషా, రియాజ్ ఉన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ మున్సిపల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. నార్సింగ్ మున్సిపాలిటీలో కొంతమంది నాయకుల పని అయిపోయిందని వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నార్సింగ్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.