calender_icon.png 14 August, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

11-08-2025 01:02:27 AM

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

గాంధారి, ఆగస్టు 10 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం రోజున గాంధారి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి పరిశీలించడం జరిగింది.  గండివేట్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఐమా క్స్ లైటును ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రారంభించారు.

అదేవిధంగా గండివేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఆ ఇంటి నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఆ లబ్ధిదారులతో మాట్లాడి వారి  అభిప్రాయాలను సేకరించారు. మాకు ఇల్లు మంజూరు చేసి, మా కుటుంబ సొంత ఇంటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్, సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని బిల్లులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా ల్లో జమ చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలిపారు.  గిరిజన ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో పెంచిన వరి బుట్టలను ఎమ్మెల్యే తన నెత్తిన పెట్టుకొని వారు  చేసే నృత్యాలలో పాల్గొని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవులు యాదవ్, గాంధారి సొసైటీ చైర్మన్ సాయికుమార్, డైరెక్టర్  సంతోష్, మండల సీనియర్ నాయకులు తూర్పు రాజులు, కామెల్లి బాల్రాజ్, లైన్ రమేష్, సంఘని బాబా  గాంధారి పట్టణ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గండివేట్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లి ఆశీసులతో ఎల్లారెడ్డి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

ఎల్లారెడ్డి, ఆగస్టు 10 (విజయక్రాంతి): లింగంపేట మండలం సజ్జన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ భూమిపూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీసులతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా రైతులు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నారు.

పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం,అభివృద్ధి కోసం తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లి దీవెనలతో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీసులతో భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.

అనంతరం భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పతి యుద్దీన్, రఫీ యుద్దీన్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.