calender_icon.png 18 November, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఐఎంఎస్‌లో ఆప్తమాలజీ విభాగాన్ని ప్రపంచ శ్రేణిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం

18-11-2025 12:00:00 AM

చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు

మేడ్చల్ అర్బన్, నవంబర్ 17 (విజయ క్రాంతి): మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ లో ఆప్తమాలజీ విభాగాన్ని ప్రపంచ శ్రేణిలో అభివృద్ది చేయడానికి సాంకేతిక నైపుణ్యంతో పాటు సహకారాన్ని అందించనున్న ఎల్వి ప్రసాద్ కంటి ఇన్సిస్టిట్యూట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఆప్తమాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద కంటి పరిస్థితులపై సమగ్ర అవగాహనపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ కంటి ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు, చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వర రావుతో పాటు అమెరికాలో ప్రఖ్యాతి గడించిన కంటి వైద్య నిపుణులు, పరిశోధకులు అమెరికాలో గల యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా డీన్ గా నియమించబడిన మొట్టమొదటి తెలుగు భారతీయుడు డా. నర్సింగ్ రావు, ఎల్వి ప్రసాద్ కంటి ఇన్సిస్టిట్యూట్ కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ పద్మజకుమార్ రాణి, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మధు కె మోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మధు కె మోహన్ మాట్లాడుతూ మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ మరియు ఎల్వి ప్రసాద్ కంటి ఇన్సిస్టిట్యూట్ లు కలసి పని చేయడం ద్వారా కళాశాలలోని ఆప్తమాలజీ వైద్య విభాగానికి లాభం చేకూరుతుందన్నారు. అనంతరం ఎల్వి ప్రసాద్ కంటి ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు, చైర్మన్  పద్మశ్రీ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వర రావు మాట్లాడుతూ మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ తో కలసి ఎల్వి ప్రసాద్ కంటి ఇన్సిస్టిట్యూట్ కలసి పని చేస్తుందని ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్  డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి, మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ప్రిన్సిపాల్  డాక్టర్ శైలేంద్ర, మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆప్తమాలజీ విభాగం అధిపతి డాక్టర్ వై. జయశాంతి లత,  ఆప్తమాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ యస్ స్రవంతి, డాక్టర్ రత్నకుమారి లతో పాటూ పిజి వైద్యులు, వైద్య విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు.