24-01-2026 12:45:45 AM
ఇందిరమ్మ స్ఫూర్తితో రేవంత్ పాలన
మున్సిపల్ ఎన్నికల్లో సర్వేలన్నీ కాంగ్రెస్కే అనుకూలం
కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి
పటాన్చెరు/ తూప్రాన్, జనవరి 23 : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రె స్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి, ఉమ్మ డి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంక ట స్వామి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలు, తూప్రాన్ పట్టణంలో కాంగ్రెస్ సన్నాహక స మావేశానికి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇం చార్జి నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా నిర్వహించిన సర్వేలో పటా న్ చెరులో కాంగ్రెస్ కే అనుకూలంగా ఉందన్నారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చి అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేస్తే ఐదు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ స్పూర్తితో తెలంగాణలో సాగుతున్న ప్రజా పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.
మెదక్ పార్లమెంటు ఇంచార్జి నీలం మ ధు మాట్లాడుతూ కొందరు నాయకులు పనిగట్టుకుని కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నాయని కార్యకర్తలను అయోమయానికి గురిచేసే ప్ర యత్నం చేస్తున్నారని తెలిపారు. కానీ కాంగ్రెస్ లో వర్గాలు లేవని, ఉన్నది ఒక్కటే కాం గ్రెస్ పార్టీ వర్గమేనని స్పష్టం చేశారు. కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయని, పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీలు శశికళ యాదవ రెడ్డి, చిన్న ముదిరాజ్, కార్పొరేటర్ పుష్ప నగేష్, మండల , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్లో గెలుపు మనదే...
తూప్రాన్ లో ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సాపూర్ నేతృత్వంలో నిర్వహించగా కాంగ్రెస్ శ్రేణులు మంత్రిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. తూప్రాన్ మండలంలో అధిక శాతం సర్పంచ్ లను గెలిపించారని, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భూమిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పల్లెర్ల రవీంద్ర గుప్తా, మామిళ్ళ కృష్ణ, మాజీ కౌన్సిలర్లు భగవాన్ రెడ్డి, మామిడి వెంకటేష్, నారాయణ గుప్తా, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ దీపక్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల పోరం ఉపాధ్యక్షులు పెంట గౌడ్, విటల్ రెడ్డి, జిల్లా సర్పంచుల అధ్యక్షుడు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.