calender_icon.png 24 January, 2026 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిర్డీలో ఏఐఎస్‌జీఈఎఫ్ మహాసభలు

24-01-2026 12:44:27 AM

హాజరైన టీఎన్జీవో నాయకులు

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): మహారాష్ట్రలోని షిర్డీలో జరుగుతు న్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మహాసభలలో తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ మహాసభల్లో నిర్వహించిన వర్క్‌షాపులో లోతైన చర్చలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు, టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, టీఎన్జీవో సెం ట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్, ఖమ్మం జిల్లా టీఎన్జీవో అధ్య క్షుడు, టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, టీఎన్జీవో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కొమరగిరి దుర్గాప్రసాద్, జిల్లా జాయింట్ సెక్రెటరీ ఏలూరి హరికృష్ణ కోణా ర్ పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిరక్షణ, ఉద్యోగుల హక్కులు, మరి యు పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. కాగా మహాసభలకు హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓల ప్రతినిధి బృందం హాజరైంది. టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌కుమార్ నాయకత్వంలో జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, ఈఎన్‌టీ ఆస్పత్రి యూనిట్ అధ్యక్షు లు టీ రాజు, ఐటీఐ టీఓ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా లోని ఉద్యోగులు ఎదుర్కొంటు న్న సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు, ఏఐఎస్‌జీఈఎఫ్ వైస్-చైర్మన్ జగదీశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.