calender_icon.png 31 July, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు

30-07-2025 01:01:30 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జూలై ౨౯ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ అందించే ఏ సంక్షేమ పథకలైన ప్రజల కట్టే ట్యాక్స్ సొమ్ముతోనే అందించడం జరుగుతాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, ప్రధాని అయిన ఎవరు తమ ఇళ్లల్లో నుండి ఇవ్వరని ఇది ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు.

జైనథ్ మండలంలో మంగళవారం జైనథ్, బేల, సాత్నాల, బోరజ్ మండలాల లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వారి కి ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వా లు అందించే పథకాలు ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదని, తాను బీజేపీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన కేవలం బీజేపీ వాళ్ళకే ఎమ్మెల్యే కాదని, నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే అని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిన, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం ప్రజలందరిది అని గమనించాలన్నారు.

ప్రభు త్వ సొమ్ము దుర్వినియోగమైన, ప్రభుత్వ పథకాలు నిరుగారిన అది ప్రజల సొమ్ము దుర్వి యోగమే అయినట్లుగా భావించాలని సూచించారు. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పేద వారీగా గుర్తించి, అన్ని పథకాలు అందుతాయనే భావన ఉండేదని, కానీ ప్రస్తుతం కేవ లం తెల్ల రేషన్ కార్డు మాత్రమే ప్రామాణికం కాదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, సివిల్ సప్లయ్ అధికారి వాజిద్, తదితరులు పాల్గొన్నారు.