calender_icon.png 1 August, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ వసతి గృహాలను సమర్థవంతంగా నిర్వహించాలి

31-07-2025 11:14:23 PM

జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలో నడపబడుతున్న వసతి గృహాలను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య అన్నారు. గురువారం వివిధ వెనుకబడిన తరగతుల వసతి గృహాల సంక్షేమ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణా కార్యక్రమానికి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పురుషోత్తంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంక్షేమ గృహంలో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించడం,

ప్రతి రోజు తప్పకుండా భోజనం పట్టికలో చూపిన విధంగా ఏ రోజు పెట్టవలసిన ఆహార పదార్థాలను ఆ రోజు తప్పనిసరిగా అందించాలని తెలిపారు. వేడిగా వండిన పదార్థాలను మాత్రమే వడ్డించాలని, ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులు వినియోగించాలని తెలిపారు. వసతి గృహ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ,  అవకాశం ఉన్న చోట జామ, నిమ్మ, మునగ, పనస, కరివేప చెట్లను పెంచాలన్నారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి పిల్లలు యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. అలాగే సంక్షేమాధికారులు శిక్షణ పొందిన వారు విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు.