calender_icon.png 1 August, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో పనిచేశాము.. నిధులు ఇప్పించండి

31-07-2025 11:09:28 PM

నాలుగేళ్ల క్రితం పనులు చేస్తే ఇప్పటికీ బిల్లులు ఇస్తలేరు కలెక్టర్  వేడుకున్న కాంట్రాక్టర్లు

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేశామని,  మాకు నిధులు ఇప్పించండి సార్  అంటూ ముత్తారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్లు తాత చేరాలు, పింగిలి దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ... గత నాలుగేళ్ల క్రితం పాఠశాల లో మరుగుదొడ్లు నిర్మించామని, అలాగే ప్రహారీ గోడ పనులు చేశామని, కొంత బిల్లు వచ్చిందని, మీగిత బిల్లు ఇప్పటికీ వరకు పాఠశాల విద్య కమిటీ ఇస్తలేరని  వారు అవేదన వ్యక్తం చేశారు.

ఈ బిల్లుల కోసం ఎంపీడీవో పంచాయతీరాజ్ ఏఈ లను అడుగగా, విద్య కమిటీ నిధుల నుంచి మీకు బిల్లులు ఇప్పిస్తామని తెలిపారని, బిల్లు ఇప్పటివరకు రాలేదని, ఇప్పటికి ఎన్నోసార్లు పాఠశాల హెడ్మాస్టర్ ఓదెలను అడగగా మీ బిల్లు ఇంకా రాలేదని దాటే వేశారని, పాఠశాల అభివృద్ధికి మేము పనులు చేసి ఆర్థికంగా నష్టపోయామని, ఆ విషయం గ్రామస్తులకు పాఠశాల అప్పటి విద్య కమిటీ చైర్మన్, డైరెక్టర్లకు కూడా తెలుసని, అయినప్పటికీ తమకు నిధులు ఇవ్వకుండా హెడ్మాస్టర్, విద్యా కమిటీ చైర్మన్ ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్  ఫిర్యాదు చేయనున్నట్లు కాంట్రాక్టర్లు తెలిపారు.

నిధుల గోల్మాల్ పై గ్రామస్తుల ఆందోళన

అడవి శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిధుల గోల్మాలపై గ్రామస్తులు గురువారం జెడ్పి ప్రభుత్వ పాఠశాలలో గ్రామస్తులు ఆందోళన చేశారు. గతంలో పనిచేసిన కాంట్రాక్టర్కు చీరాలకు డబ్బులు ఇవ్వకపోవడంపై స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు.