calender_icon.png 10 May, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయంత్రమే తెరుస్తారు

10-05-2025 12:35:21 AM

  1. నిర్లక్ష్యంలో రేషన్ డీలర్లు... 

డీలర్ షాపులపై కొరబడిన పర్యవేక్షణ

సగం రేషన్ షాపులో ఇదే తంతు 

జిల్లావ్యాప్తంగా అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ 

భద్రాద్రి కొత్తగూడెం మే 9 (విజయ క్రాంతి) రేషన్ షాపులు అంటే సాయంత్రం తెలిసే దుకాణాలుగా మారాయి. నిత్యావసర సరుకు కోసం లబ్ధిదారులు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. షాపుల నిర్వాహణ లో రేషన్ డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలబడుతున్నాయి.

ఉద యం ఏ షాపు చూసినా తాళం వేసే ఉంటుం ది. సాయంత్రం కొంత సమయం షాపులు తెరిసి మామ అనిపిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథ కాన్ని ఆఫీసర్లు, డీలర్లు నేరుగారొస్తున్నారని విమర్శల సర్వత్రా వినిపిస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 443 రేష న్ షాపులు ఉండగా షాపులు ఎప్పుడు తీస్తా రో బియ్యం ఎప్పుడు ఇస్తారో అంటూ రేషన్ దుకాణాల చుట్టూ లబ్ధిదారు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 443 రేషన్ షాపులు, 2.93 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఎటవల ప్రభుత్వం ప్రారంభించిన సన్నాభయం పథకానికి ప్రజల నుంచి మం చి ఆదరణ లభిస్తుంది.

రేషన్ షాప్ డీలర్లు పథకాన్ని నేరుగాచేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ  వెలబడుతున్నాయి. సోమవా రం మినహాయించి మిగల అన్ని రోజుల్లో ప్రతి షాపు ఉదయం 8 గంటల నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సమయపాలన పాటించాల్సి ఉంది. డీలర్లు మాత్రం సమయపాలనను విస్మరించి వారికి అనుకూలంగా ఉన్న సమయంలోనే షాపులు తీసి మామ అనిపిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం లబ్ధిదారులకు సకాలంలో దరిచేరే పరిస్థితి కల్పించడం లేదు. 

క్షేత్రస్థాయి పరిశీలనలో

 రేషన్ షాపుల నిర్వహణపై విజయ క్రాంతి శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన పాల్వంచ పట్టణంలో నిర్వహించింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల సమయంలో పలు దుకాణాలను పరిశీలించగా అధిక షాపులకు తాళాలు దర్శనమి చ్చాయి. ఉదయం 11:30 నిమిషాలకు నవభారత్ లోని ఓ షాపును పరిశీలిస్తే డీలరు అరగంట తెరిసి ఎవరూ రావడం లేదం టూ వెళ్లిపోయారని, 11.40 గంటలకు మరో షాపును పరిశీలిస్తే తాళం వేసి ఉంది. ఇల్లు, షాపు ఒకే చోట ఉన్న షాప్ కు తాళం దర్శనమిచ్చింది.

11 50 గంటలకు పాత పాల్వంచలోని ఒక షాపును పరిశీలించగా డీలర్ సాయంత్రం సమయంలో వస్తారు ఉదయం రారని సమాధానం వచ్చింది.ఒక షాపు వద్దకు వెళ్తే డీలర్ షాప్ తెరిచి ఉంచారు ఆ షాపులో 931 తెల్ల రేషన్ కార్డు లు 34 అంత్యోదయ కార్డులు ఉన్నాయని, 131 క్వింటాల బియ్యం సరఫరా చేశారని, ఈరోజు వరకు 72 క్వింటాల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఇలా ప్రతి షాపు వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకోవడానికి అగచాట్లు పడుతున్నారు. షాపుల నిర్వహణపై పాల్వంచ సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులని వివరణ కోరగా, ప్రతి డీలర్ షాపు ఉదయం 8 - 12 గంటల వరకు, సాయం త్రం 4-8 గంటల వరకు విధిగా తెరిచి ఉంచాలి అన్నారు. ఈ నెలలో కొన్ని దుకాణాలకు బియ్యం సరఫరా లో లేటు కావడం వల్ల తెరిచి ఉండకపోవచ్చు అని సమాధానం ఇచ్చారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.