20-10-2025 12:53:27 AM
ప్రభుత్వం నిబంధనలకు నీళ్లు..
పట్టించుకోని అధికారులు..
అధికారుల ఆదేశాలు బేఖారత్
నల్లగోండ అక్టోబర్ 19(విజయ క్రాంతి) దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి పూజలతోపాటు ప్రత్యేకంగా టపాసులు కాల్చే ఆనవాయితీ ఉంది. పండుగలు వచ్చాయంటే పిండివంటలతో పాటు టపాకాసులు పేల్చినప్పుడే సందడి ఉంటుంది. పండగలకే కాదు పుట్టినరోజులకు పెళ్లిళ్లకు ,చావులకు ప్రతి కార్యక్రమానికి టపాకాయలు పేల్చడం అలవాటు మారింది .దీంతో టపాకాసులకు ప్రాధాన్యత సంచరించుకొని వ్యాపారం అడుగు అడుగున విస్తరించింది.
ఒక బిజినెస్ నిర్వహిస్తూ దాంతో పాటు అదనపు ఆదాయం కోసం టపాకాసుల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.ఈ పండగ నేపథ్యంలో వ్యాపారులతోపాటు కొనుగోలుదారులు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతి ఉంటేనే టపాసుల విక్రయించే వీలుంటుంది.
వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు టపాసులు కొనుగోలు చేసి నకిరేకల్ పట్టణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడంతో జేబులకు చిల్లులుపడుతున్నాయి.అధికార యంత్రాంగం ధరల్ని నియంత్రించాలని వినియోగదారులు కోరుతున్నారు. బాణసంచా విక్రేతలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. పబ్లిక్ ప్లేస్ నిర్వహించరాదు.
కాని గత కొన్ని నీళ్లుగా ఇష్టానుసారంగా పబ్లిక్ పేస్ లో . రోడ్లపైనే అమ్మకాలు నిర్వహిస్తూ ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా వ్యాపారాలుసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అనుమతులు పొందకుండా ప్రభుత్వ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నకిరేకల్ పట్టణంలో ఇతర పలు ప్రాంతాల్లో నేటికీ అనుమతులు లేకుండానే టపాసుల విక్రయ దుకాణాలు వెలిశాయి.
ప్రభుత్వ అధికారులు యంత్రాంగం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వ అధికా రులు, యంత్రాంగం పర్మిషన్ లేని టపాకాసుల వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుని ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నకిరేకల్ పట్టణంలో రోడ్లపైనే టపాకాసుల అమ్మకాలు
నకిరేకల్ పట్టణంలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్ పేస్ లో రోడ్లపైనే టపాకాసుల విక్రయాలు బంగారంషాపుల, రెడీమేడ్ డ్రెస్సెస్ , టీ స్టాల్, ఫుట్ వేర్ , హాస్పిటల్స్,పూల సెంటర్, ఎక్కడబడితే అక్కడ అనేక సెంటర్లలో జోరుగా సాగుతున్నాయి.
ముందు గత నాలుగు ఐదు రోజుల క్రితం ప్రభుత్వ అధికారులు టపాకాసులు పబ్లిక్ ప్లేస్ లో నిర్వహించొద్దని ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉండాలని సూచించిన అధికారుల ఆదేశాలను టపాకాసుల నిర్వాహకులు బేఖాతరు చేశారని ప్రజల ఆరోపిస్తున్నారు.
విచ్చలవిడిగా విక్రయాలు నడుస్తున్న ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా అని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోంటారో వేచి చూడాల్సిందే.
జాగ్రత్తలు తప్పనిసరి.. : అనుమతులు తీసుకున్నవారే పబ్లిక్ ప్లేస్ దూరంగా టపాసులు విక్రయించాలి. విక్రయ దుకాణాల వద్ద అనుమతుల పత్రాలతోపాటు నీరు, ఇసుక అందుబాటులోఉంచుకోవాలి. దుకాణాల మధ్య దూరం 3 మీటర్లు ఉండాలి. మంటలను ఆర్పే యంత్రం ఉంచుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులు టపాసులు కాల్చేసమయంలో దూరంగా ఉండాలి. చేతిలో పట్టుకొని బాణసంచా కాల్చరాదు. జనం మధ్యలో అమ్మకాలు నిర్వహించరాదు.
అనుమతులు ఉండాలి
టపాకాసులువిక్రయించాలంటే కచ్చితంగా అనుమతులు పొందాలి. పబ్లిక్ ప్లేస్ లో నిర్వహించరాదు. నకిరేకల్ లో మూడు షాపులకు మాత్రమే అనుమతు లున్నాయి. మిగతా ఏ షాపులకు కూ డా అనుమతులు లేవు. కేవలం మేము ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వడానికి ఉన్నది. చర్యలు తీసుకోవడానికి మాకు పవర్స్ లేవు.
సాయి దీపక్ ఎస్.ఎఫ్.ఓ నకిరేకల్
పర్మిషన్ తీసుకోమని చెప్పాం
నకిరేకల్ పట్టణంలో ని సెంటర్ నిర్వహించే టపాకాసుల విక్రయాలకు అనుమతులు లేవు. యాజమాన్యలను పిలిచి అనుమతులు పొందాలనిచెప్పాం ఫైర్ ఎన్‌ఓసి తీసుకోవాలని పబ్లిక్ ప్లేస్ లో నిర్వహించోద్దని చెప్పం. మున్సిపల్ నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.
రంజిత్ కుమార్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్