calender_icon.png 20 October, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శునకం.. భయానకం!

20-10-2025 12:50:43 AM

  1. రోడ్లపై చర్మవ్యాధిగ్రస్త కుక్కల సంచారం 

పిర్యాదులు చేసినా చర్యలు శూన్యం

రానురాను సమస్య మరింత జటిలం

అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొంటున్న జనం

చివ్వెంల, అక్టోబర్ 17: మండలంలో వీధి కుక్కల బాధ రోజు రోజుకి  మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఒకటి, రెండు గ్రామాలలో కాకుండా చాలా గ్రామాలలో పదుల సంఖ్యలో వీధి కుక్కలు పగలు, రాత్రి వీధుల వెంట సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయి తే ఆ వీధి కుక్కల చర్మంపై రోమాలు ఊడిపోయి చర్మ వ్యాధులతో మరీ ఇబ్బందిక రంగా కనపడుతుండడంతో గ్రామస్తులు ఆందోళనలు చెందుతున్నారు.                         

 గాయాలతో శునకాలు.. 

శరీరంపై వెంట్రుకలు ఊడిపోవడంతో పాటు చర్మవ్యాధి తీవ్రం కావడంతో శరీరమంతా గాయాలయి, వాపులతో ఉన్న ఈ కుక్కలు గ్రామ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దీనితో పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే వణికిపోతున్నారు.

గతంలో చి వ్వేంల, అక్కలదేవి గూడెం, పిల్లల జగ్గుతం డ, తిమ్మాపురంలతో పాటు పలు గ్రామాల లో శునకాలు దాడి చేసిన ఘటనలో పలువురు గాయాలపాలైన సందర్భాలు అనేక ఉన్నాయి. దీంతో కుక్కలు అంటేనే చాలామంది భయాందోళనకు గురవుతున్నారు.

 ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం                    

ప్రజలు పలుమార్లు స్థానిక అధికారలకు, పశువైద్య శాఖ వారికి ఈ సమస్యపై ఫిర్యాదులు చేసినా, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది. కుక్కలకు ఉన్న చర్మవ్యాధి ఇతర కుక్కలకు లేదా మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారవచ్చని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు రోడ్లపై తిరుగుతున్న ఈ చర్మవ్యాధిగ్రస్త కుక్కలను గుర్తించి వాటికి సరైన చికిత్స చేయడంతో పాటు, వ్యాక్సిన్లు వేసి వాటివల్ల ఎటువంటి ప్రమాదాలు  జరుగకుండా చూడాలని మండలవాసులు కోరుతున్నారు. 

చికిత్సలకు తగు చర్యలు తీసుకుంటాం 

ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శులకు వెంటనే సమాచారం అందజెస్తాము. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. పశువైద్య శాఖ వైద్యులతో మాట్లాడి చికిత్సలకు తగు చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా వీధి కుక్కల పట్ల జాగ్రత్తలు వహిస్తూ వాటికి కూడా ఇబ్బందులు కలుగకుండా చూడాలి.

 సంతోష్ కుమార్, ఎంపీడీఓ, చివ్వేంల 

కుక్కలకు చికిత్స చేయించాలి:                                 

 గ్రామాల్లో సంచరిస్తున్న చర్మవ్యాధిగ్రస్త కుక్కలను చూస్తే ఒళ్ళు కంపరం పుడుతుంది. వీటితో రోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున  అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలి. కుక్కలకు చికిత్స చేయించి వాటి నుండి రోగాలు వ్యాప్తి చెందకుండా చూడాలి. 

 గురవయ్య, అక్కలదేవిగూడెం గ్రామస్థుడు