calender_icon.png 12 October, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ టెండర్లేమిటి?

11-10-2025 01:04:49 AM

  1. ‘బనకచర’్లపై తెలంగాణ అభ్యంతరం 
  2. ఈ ప్రాజెక్టుతో తమ రాష్ట్రానికి అన్యాయమంటున్న సర్కార్
  3. డీపీఆర్ తయారీకి ఏపీ టెండర్లు పిలవడంపై కేంద్రానికి లేఖ 
  4. సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి టెండర్లు పిలవడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఆమోదించవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మరోసారి అభ్యంతరం తెలుపుతూ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కు లేఖ రాయ డానికి సిద్ధమై నట్టు సమాచారం.

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం ఇటీవల ఏపీ జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బిడ్‌లో పాల్గొనేందుకు వీలుగా టెం డర్లు దాఖలు చేయవచ్చని ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ మొదటి నుంచీ అభ్యంత రం వ్యక్తం చేస్తోంది.

ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడంతో తెలంగాణ మరోసారి సీడబ్ల్యూసీకి ఫిర్యా దు చేయనుందని తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని, డీపీఆర్ తయారీని నిలిపివేయాలని డిమాండ్ చేయనుంది. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు మరింత వివాదాస్ప దంగా మారే అవకాశం ఉంది.