calender_icon.png 5 July, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకిచ్చిన హామీలు ఏమయ్యాయి?

05-07-2025 12:55:51 AM

  1. ప్రభుత్వాన్ని నిలదీసిన నిరుద్యోగులు
  2. సచివాలయ ముట్టడికి యత్నం
  3. అడ్డుకున్న పోలీసులు
  4. జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల డిమండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్ర సచివాలయం వద్ద శుక్ర వారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత ‘చలో సచివాలయం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిం ది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ, వామపక్ష విద్యార్థి జేఏసీ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు.

సచివాలయం ముట్టడికి వస్తున్న నిరుద్యోగులను పోలీసులు భారీగా మోహరించి అడ్డు కున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా ముందుకు కదులుతున్న నిరసనకారులను పోలీసు వాహనాల్లోకి ఎక్కించి స్థానిక పోలీ స్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరుద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరుద్యోగుల ఆందోళనలతో సెక్రెటేరియట్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ రూ పొందించి అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చి.. అధి కారంలోకి వచ్చాక తుంగలో తొక్కారని మండిపడ్డారు.