calender_icon.png 9 December, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ హైకోర్టులో ఎన్టీఆర్ పిటిషన్

09-12-2025 01:13:34 AM

సోషల్ మీడియాలో కొందరు తన వ్యక్తిగత హక్కులకు భం గం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ కామర్స్ సంస్థలు తన ఫొటోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ ఫిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలను ఎవరూ వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. 2021 ఐటీ నిబంధనల ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లో గా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సోషల్ మీడియా సంస్థలను ఆదేశిం చింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుతోంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.