calender_icon.png 27 September, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి ఏంటీ దుస్థితి?

27-09-2025 12:35:37 AM

  1. ‘బ్లాక్ ఫంగస్’ వంటి మహమ్మారికి అద్భుత సేవంలందించింది

నాలా మరమ్మతు పనులు చేపట్టాలి

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ‘బ్లాక్ ఫంగస్’ వంటి మహమ్మారికి సైతం అద్భుతంగా సేవలు అందించిన కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి ఏంటీ దుస్థితి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వరదల కారణంగా ఆస్పత్రి ఆవరణలో నిలిచిన నీటి ఫొటోను షేర్ చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆస్పత్రి నాలా మరమ్మతులు చేయక పోవడంతో భారీగా వర్షం నీళ్లు చేరుతున్న.

పరిస్థితి ఉందని తెలిపారు. వర్షం పడుతున్న ప్రతీసారి పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వంలో కనీసం స్పందన లేదని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి నాలా మరమ్మతు పనులు చేపట్టాలని, వరద నీరు ఆస్పత్రికి చేరకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.