01-12-2024 12:38:13 AM
-నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
మొట్ట మొదటిసారి 1988లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ‘టేక్ ద రైట్ ఫాత్ మై హెల్త్’ అనే థీమ్‌తో ఈ ఏడాది ఎయిడ్స్ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, హక్కులకు మద్దతు ఇవ్వడం, నివారణ, చికిత్సను ప్రోత్సహించడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ఎయిడ్స్ రోగులకు సంఘీభావం తెలపడానికి ’రెడ్ రిబ్బన్ ’చిహ్నం.
హెచ్‌ఐవితో జీవిస్తున్న వ్యక్తుల సమూహాలు, వాటి ప్రతిస్పందనలో పాలు పంచుకుంటున్న సంస్థల వారు చేసే సేవలకు సంఘాలకు మద్దతుగా నిధులను సేకరిం చడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 42.3 మిలియన్ల మంది హెచ్‌ఐవీతో మరణించారు. 2023లో దాదాపు 63 వేల మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోయా రు. దాదాపు 85.6 మిలియన్ల మంది ఇప్పటివరకు హెచ్‌ఐవీ బారిన పడ్డారు.
2023లో దాదాపు 1.3 మిలి యన్ల మంది కొత్తగా వ్యాధి బారిన పడ్డారు 18 ఏళ్లలోపు వయసు ఉన్న కోటీ 41 లక్షల మంది సంబంధిత కారణాలవల్ల ఒక రు లేదా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయారు. పేదరికం,నిరాశ్ర యత, చదువు మానేయడం, వివక్ష, అవకాశాలను కోల్పోవడం వంటి ప్రమాదాలను ఎదుర్కొం టున్నారు.హెచ్‌ఐవీ అనేది వ్యక్తికి శారీరక ద్రవాల మార్పిడి ద్వారా సంక్రమిస్తుంది. ఒకే సిరంజీని ఎక్కువ మందికి ఉపయోగించడం, లేదా అసురక్షిత రక్తమార్పిడి, హెచ్‌ఐవీ సోకిన వ్యక్తితో లైంగిక సంబంధం వంటివాటి వల్ల సంక్రమిస్తుంది.
హెచ్‌ఐవీ తల్లి పాలు ఇవ్వడంద్వారా బిడ్డకు సంక్రమిస్తుంది. కలిసి భుజించడం లేదా కలిసి ఉండటం ద్వారా ఇది సంక్రమించదు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే హెచ్‌ఐవీ అనేది మన రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసే వైరస్ అయితే ఎయిడ్స్ అనేది హెచ్‌ఐవీ సంక్రమణ యొక్క అత్యంత అధు నాతన దశ. అనుకోకుం డా ఈ వ్యాధికి గురైన ప్రజలకు మద్దతు ఇవ్వడం, భవిష్య త్తులో ఈ వ్యాధికి గురికాకుండా ప్రయత్నం చేయడం, సరైన సమ యంలో సరైనచికిత్స పొందడం అనేది హెచ్‌ఐవీ నివారణలో ముఖ్యమైన అంశం.
సరైన ఆరోగ్య బీమాను కలిగి ఉండడం వలన మీకు అవసరమైన ఆరోగ్య బీమా ప్రయోజ నాలను పొందవచ్చు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పెన్షన్లు, మందులు అందిస్తున్నాయి. దీనివల్ల వారి ఆయురారోగ్యం కూడా పెరుగుతుంది. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తులు, వైరస్ లేని వారు దాదాపు సమానంగా జీవించే అవకాశాలు పెరుగుతున్నాయి. నివారణ మాత్రమే ఉండి నిర్మూలన లేని వ్యాధి ఇది. బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టబడడం, ఇతర సాంఘిక కారణాలు పేదల్లో ఈ వ్యాధి వ్యాపించడానికి కారణం అవుతున్నాయి.
లైంగిక జీవనం పట్ల అపోహ, మూఢ నమ్మకాలు మొదలగునవి కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి అందుకే లైంగిక విద్యను ఒక పాపంగా చూడకుండా అవగాహన కల్పించి చైతన్యం కల్పిం చే విధంగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలి. సెక్స్ వర్కర్లకు ఉపాధి మార్గాలు పెంచాలి. ఇది ఆర్థిక కోణంలోని సామాజిక సమస్య.
-ఉమాశేషారావు వైద్య