calender_icon.png 26 May, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు

01-12-2024 12:46:32 AM

చదువంటే కేవలం ఇంజినీరింగ్ చదువు, అందులోనూ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ కోర్సులు అన్న భ్రమలో సమాజం ఉన్నది. దశాబ్ద కాలంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వాలు మీన మేషాలు లెక్కిస్తున్నాయి. విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు లేవు. అధ్యాపకులకు బోధనా సామర్థ్యాలు అంతకంటే లేవు. 

నిర్వీర్యమైన విద్యావ్యవస్థ ఒక్కటి చాలదా, దేశంలోని అన్ని వ్యవస్థలనూ ఛిద్రం చేయడానికి!? హైదరాబాద్, వరంగల్, అనంతపురం, తిరుపతి, విశాఖ, కర్నూలు జిల్లాలలో నేడు విశ్వవిద్యాలయాలల్లో శ్మశాన ప్రశాంతత నెలకొంది. గత మూడేళ్లుగా న్యాక్, ఎన్బీఏ, చివరికి దూరవిద్యలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అక్రిడేషన్ లేకుండానే అధికారులు కాలం గడుపుతున్నారు. ఉన్నత విద్యకు అవసరమైన చాలినన్ని బడ్జెట్ కేటాయింపులు లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.

విశ్వవిద్యాలయాలకు బ్లాక్‌గ్రాంట్లు నామమాత్రంగా ఉన్నాయి. తల్లికి వందనం, విద్యార్థులకు వసతి దీవెన, ఫీజు రీఇంబర్స్‌మెంట్ లేక విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క రీసర్చ్ ప్రాజెక్టు లేదంటే తెలుగురాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల ఘనత వేరే చెప్పనక్కర్లేదు. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగేలాకూడా లేదు. 

చదువంటే కేవలం ఇంజినీరింగ్ చదువు, అందులో కేవలం ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ కోర్సులు అన్న భ్రమలో సమాజం ఉన్నది. దశాబ్ద కాలంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వాలు మీన మేషాలు లెక్కిస్తున్నాయి. విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు లేవు. అధ్యాపకులకు బోధనా సామర్థ్యాలు అంతకంటే లేవు. యాభై సంవత్సరాల ముందు వెలసిన విశ్వవిద్యాలయాల్లో అకాడమిక్ స్టాఫ్ కాలేజీలు మూతపడి దశాబ్దం అవుతున్నది.

రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవలప్‌మెకోర్సులు అన్నీ  అనియత విద్యలాగా టీవీలు, కంప్యూటర్లలో బోధిస్తున్నారు. ఉన్న విశ్వవిద్యాలయాలు పటిష్టం చేయకుండా కొత్తగా మరిన్ని విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. విద్యాలయాలంటే బిల్డింగులు, స్థలాలు కాదు. అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధ పడటం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలను శాశ్వతంగా మూసి వేయడం ఖాయమనిపిస్తుంది.

విశ్వవిద్యాలయాలు మొదలుపెట్టి ఐదేళ్లయినా నిధుల కొరత తీరడం లేదు. విద్యలో నాణ్యత ఉండాలని, క్వాలిటీని పెంచడానికి కొత్తగా కన్సల్టెన్సీల ద్వారా కోఆర్డినేటర్లను నియమించి ఉన్న కొద్దిమంది అధ్యాపకులతో కమ్యూనిటీ డెవలప్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ ఏర్పాటు వంటి అర్థం పర్థం లేని పనులు చేయిస్తున్నారు. కొత్త కోర్సులు బోధించడానికి బోధకులు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు.

అధ్యాపకులకు ఓరియెంటేషన్, రిఫ్రెషర్ కోర్సులు లేవు. బోధనా నైపుణ్యాలు మెరుగు పడాలంటే బోధకులకు కొత్త అంశాలపట్ల శిక్షణ ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణా మార్గదర్శి, మెటీరియల్ దొరకడం లేదు. అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు, ఓరియెంటేషన్ కోర్సులు లేక కళాశాలలో బోధన చప్పగా ఉంటున్నది. చాలా అనుబంధ కళాశాలల్లో, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలు లేకుండా కేవలం బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్సు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లర్నింగ్  కోర్సులు మాత్రమే ఉంటున్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలు సరెండర్ చేసి కంప్యూటర్ కోర్సులు తెచ్చుకుంటున్నారు.

ఇక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, వాటికి అప్రూవల్ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఒక దశ దిశ లేకుండా, ముందుచూపు, ఆలోచనకు తావివ్వకుండా అస్తవ్యస్తంగా విద్యారంగం మారిపోతున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం చాలా ఉంది. విలువలుతో కూడిన విద్యా ప్రమాణాలను తీసుకొని రావాలి. 

- డా. యం.సురేష్ బాబు