calender_icon.png 21 May, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాహం తీర్చేదెవరు?

12-05-2025 12:00:00 AM

  1. గిరి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి 
  2. నీటి కోసం నరకయాతన 
  3. ఆదివాసీల అవస్థలు తీర్చేది ఎలా?
  4. అడుగంటిన బావులు, పనిచేయని బోర్‌వెల్

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే11 (విజయ క్రాంతి): గిరిజన గ్రామాలలో తాగేందుకు నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్న ఆదివాసీల గోడు పట్టించుకునే వారు ఎవరని గిరి జనులు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా ఎం డాకాలంలో గుటికెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి అడుగంటిన బావు ల్లో నుంచి నీటిని తోడుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో నెల కొం టుంది.

గత ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథ కం ప్రవేశపెట్టినప్పటికీ గిరి గ్రామాలలో మాత్రం శాశ్వత తాగునీటి పరిష్కారం తీరలేదు. మిష న్ భగీరథ మరమ్మతులు నోచుకోకపోవడం తో ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు కోసం వా గులు వంకల వెంట తిరగా ల్సిన పరిస్థితి నెలకొంది.

కొన్నిచోట్ల బోర్వెల్ పాడైపోగా మరి కొన్నిచోట్ల బావులు అడుగంటి పోవడంతో తాగునీటి సమస్య తీవ్రత రమైంది. తాగునీటి సమస్యపై క్షేత్రస్థాయిలో అధికారు లు దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ సమస్య మాత్రం తీయ డం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. 

పశువుల గోస దేవుడికే ఎరుక..

గుటికడు నీటి కోసం మనుషులు తనలాడుతున్న కాలంలో మూగజీవాల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ పక్క పశుగ్రా సం దొరకక మూగజీవాలు అల్లాడుతున్న సమయంలో కనీసం గొంతు తడిపేందుకు కూడా నీరు దొరకని పరిస్థితిలో పశువులు తల్లడిల్లుతున్నాయి.

గిరిజనులు వారు తాగేందుకు తీసుకువచ్చిన నీటిని కొన్ని కొన్ని గా పశువులకు అందిస్తున్నారు. ఏదేమైనా నీటి సమస్య తీర్చేందుకు అధికారులు పాలకులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగితే కానీ ఈ సమస్య తీరే పరిస్థితి లేదని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.

కిలోమీటర్ల మేర వెళ్లాల్సిందే..

తిర్యాని మండలంలోని మూలకలమంద, తోయరేటి, భీమ్రాల గ్రామాలతో పాటు పలు పంచాయతీల లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కష్టాలు తీర్చాలని ఆదివాసీలు అధికారులను వేడుకుంటున్నారు. కిలో మీటర్ల దూరం నుండి బావిలో అట్టడుగు నీటిని తోడుతు నీళ్ళను తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల సమీపంలోని వాగు వద్ద చలిమెలు తోడుకొని మీరు తెచ్చుకుంటున్నారు మరికొందరు కిలోమీటర్ల కొద్ది కాలి నడకన వెళ్లి బిందెల్లో మీరు మోసుకుంటూ వస్తున్నారు. రైతులు ఎడ్ల బండ్లపై నీటి డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని కిలోమీటర్ల దూరం వెళ్లి అష్ట కష్టాలు పడి నీరు తీసుకువస్తున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

నీటి కష్టాలు తీర్చాలి

మా ఊరిలో సా గునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సార్లు మా కష్టాలను తీర్చాలి. ప్రతి ఏడా ది మాకు ఈ కష్టాలు వస్తూనే ఉన్నాయి. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది. మిష న్ భగీరథ నీళ్లు వస్తలేవు. ట్యాంక్ ఉన్న లాభం లేదు. బావిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఊర్లో ఉన్న బోరింగ్‌లో పనిచేయడం లేదు. బోరింగ్ లోను నీళ్లు అడు-గుకు వెళ్లి పైకి వస్తలేవు.

--కుడ్మెత మారుబాయి,

మొర్రిగూడా