calender_icon.png 28 January, 2026 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్ పోరులో గెలుపెవరిది?

18-01-2026 12:00:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికల తర్వాత హర్యానా, కశ్మీర్, మ హారాష్ర్ట, జార్ఖండ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మరో మూడు నెలల్లో కీలకమైన పశ్చిమ బెంగాల్ రాష్ర్ట శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. 294 శాసనసభ స్థానాలు ఉన్న బెంగాల్ రా ష్ర్టంలో మరొకసారి తన అధికారాన్ని సుస్థి రం చేసుకోవాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాలు మోపాలని ప్రతిపక్ష బీజేపీ, కో ల్పోయిన తమ ఉనికిని కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఎన్నికల సమరాంగణంలో తలపడబోతున్నాయి. బెంగా ల్‌కు దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.

ఏడు పర్యాయాలు వ రుసగా లెఫ్ట్ ఫ్రంట్‌కు పట్టం కట్టిన బెంగాల్ ఓటర్లు 2011 శాసనసభ ఎన్నికలలో మా త్రం లెఫ్ట్ ఫ్రంట్‌ను ఓడించి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు జై కొట్టారు. వరుసగా మూడు పర్యా యాలు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజ యం సాధించిన మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా ఓడించి అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉన్న నేప థ్యంలో బెంగాల్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఆసక్తిగా మారింది. బెంగా ల్‌లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉండబో తున్నాయనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.

 తిరుగులేని మమత..

2011 బెంగాల్ శాసనసభ ఎన్నికల నుం చి మూడు పర్యాయాలు దీదీ తిరుగులేని హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ప్రతి శాసనసభ ఎన్నికల్లో తన మెజార్టీని అంతకం తకూ పెంచుకుంటూ బెంగాల్‌లో ఎదురులేని నేతగా ఎదిగారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, గత మూడు లోక్ సభ ఎన్నికలలో కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 40 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిందంటే బెంగాల్ లో తృణముల్ బలాన్ని అంచనా వేయవచ్చు. బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమత చేసిన వీధి పోరాటాలు ఆమెను ఫైర్‌బ్రాండ్‌గా నిలబెట్టాయి.

2011, 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్‌పై సునాయాసంగా విజయం సాధించిన మమతా బెనర్జీకి 2021 శాసనసభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ 215 స్థానాల్లో విజయం సాధించి మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2021 ఎన్నికల సందర్భంగా శారదా చిట్‌ఫండ్ కుంభకోణం, పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో నందిగ్రామ్ శాసనసభ నియోజకవర్గంలో సువేం దు అధికారిపై పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మమతా బెనర్జీ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి ఒంటి చేత్తో పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చారు.

సందేశ్ కాలీ, ఆర్జి కార్ హాస్పిటల్ ఘటనలు మమతా సర్కార్ ప్రతిష్టను దెబ్బతీయటం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) వల్ల టీఎంసీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారనే ఆరోపణలు, హుమాయున్ కబీర్, షేక్ షాజహాన్ లాంటి బహిషృ్కత నేతల వల్ల మైనార్టీ ఓట్లు తగ్గిపోతాయనే ఊహాగానాల నడుమ తృణమూల్ పార్టీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మమతా సర్కార్ అమలు చేస్తున్న లక్ష్మీబండార్, కృషక్ బం ధు, కన్యశ్రీ, కర్మశ్రీ లాంటి సంక్షేమ పథకా లు, దీదీ చరిష్మా, అభిషేక్ బెనర్జీ, ప్రతీక్ జైన్ ఐవూ వ్యూహాలు, బలమైన మైనార్టీ ఓ టు బ్యాంకుతో నాలుగో సారి కూడా గెలుపొందుతామనే ధీమాతో మమతా బెనర్జీ ఉన్నారు. అయితే ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధిస్తే మాత్రం బెంగాల్‌లో ఆమె చరిష్మాకు అడ్డూఅదుపు లేకుండా పోతాయి.

బీజేపీ జెండా పాతేనా!

బెంగాల్ కోటపై జెండా పాతాలనే బీజేపీ ఆశలకు 2019 లోక్‌సభ ఎన్నికలు బీజం వేశాయని చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ 40 శాతం ఓట్లను సాధించడమే కాదు ఏకంగా 18 లోక్ సభ స్థానాల్లో విజ యం సాధించి తృణమూల్ కాంగ్రెస్‌కు ధీటై న ప్రత్యర్థిగా నిలబడింది. లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన బలంతో బీజేపీ 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చి శాసనసభలో తన బలాన్ని 3 నుంచి 77 స్థా నాలకు పెంచుకొని బెంగాలలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. హిందుత్వ అజెండా, మమతా బెనర్జీ సర్కార్ అవినీతి, వైఫల్యాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ ఆశిస్తుంది.

మహా జంగిల్ రాజ్ సర్కార్ నుంచి బెంగాల్ ప్రజలను విముక్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల వ్యూహరచనలో దిట్ట అయిన బీజేపీకి కాబోయే జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్‌ను బెంగాల్ ఎన్నికల ఇన్‌చార్జీగా ని యమించి ఎన్నికల్లో గెలిచే వ్యూహాలకు బీజే పీ పదును పెడుతుంది. బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్‌లో వరా లు ప్రకటించి సానుకూల ఫలితాలు సాధించిన విధంగానే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లోనూ బెంగాల్‌కు వరాలు ప్రకటించి బెంగాలీల మనసు దోచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసే పనిలో పడింది.

గత ఐదు సంవత్సరాలుగా బెంగాల్‌లో మమత సర్కార్‌పై బీజేపీ గట్టిగానే పోరాటం చేస్తూనే ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికలలో మతువా సామాజిక వర్గం మద్దతు పొందిన బీజేపీకి ఈసారి మాత్రం ఆ వర్గం నుంచి సానుకూల పరిస్థితులు మాత్రం లేవు. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయి లో సీట్లు, ఓట్లు పొందలేక కేవలం 12 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. లెజిస్లేటివ్ పార్టీ నాయకుడైన సువేందు అధికారి లాంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ దీదీకి సరితూగే స్థానిక నాయకులు లేకపోవటం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.

కాంగ్రెస్, లెఫ్ట్ దారెటు?

ప్రస్తుతం బెంగాల్‌లో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సయోధ్య లేదు.  బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీని బీజేపీ ఎంతగా వ్యతిరేకిస్తుందో అంతకంటే ఎక్కువగా బెంగాల్ రాష్ర్ట కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. దీంతో బెంగాల్‌లో ఒక రకంగా దీదీ మరోసారి ఒంటరి పోరాటమే చేయనుంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు కలిసి బెంగాల్‌లో 11 శాతం ఓట్లను సాధించగలిగాయి. ఇప్పటికీ మాల్దా లాంటి ప్రాంతాల్లో కాంగ్రె స్ పార్టీకి గట్టిపట్టు ఉండడంతోనే దక్షిణ మాల్దా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2016 శాసనసభ ఎన్నికల వరకు కొంత బలం ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తర్వాత జరిగిన ఎన్నికల్లో క్రమంగా తమ బలాన్ని కోల్పోయి బెంగాల్ రాజకీయాల్లో నామమాత్రపు పార్టీలుగా మిగిలి పోయాయి.

ప్రభావిత అంశాలు..

‘సర్’ ద్వారా తొలగించిన 58 లక్షల ఓట్లు, 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ అధికారంలో ఉండటం వల్ల సహజంగా ఏర్పడే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతకు తోడు అవినీతి ఆరోపణలు, ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన బొగ్గు కుంభకోణం, ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గీతా పారాయణం, ఖురాన్ పఠనం, బాబ్రీ మసీదు నిర్మాణం లాంటి మతపరమైన అంశాలు కూడా టీఎంసీపై ప్రభావం చూపించబోతున్నాయి. 30 శాతం ఉన్న మైనార్టీలు, ఎంఐఎం, హుమాయున్ కబీర్‌ల జనతా ఉన్నయాన్ పార్టీలు రెండు కలి సి పోటీ చేస్తే కొన్ని ప్రాంతాల్లో గెలుపోటములు ప్రభావితం చేయనున్నాయి.

‘మాపై ఎంతైనా దాడి చేయండి.. చివరికి గెలిచేది బంగ్లానే( జోతోం కరో హమ్లా ఆబాద్ జీత్బే బంగ్లా) అనే నినాదంతో టీఎంసీ ఎన్నికలకు వెళుతుంటే హర్యానా, మహారాష్ర్ట ఢిల్లీ, బీహార్‌లో గెలిచిన విధంగానే బెంగాల్‌లో కూడా గెలిచి సత్తా చాటాలని బీజేపీ భావిస్తుంది. మొత్తంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

 వ్యాసకర్త సెల్: 9885465877