18-07-2025 12:46:04 AM
సదాశివ నగర్, జూలై 17 (విజయ క్రాంతి), ఆ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామానికి వచ్చే ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నారు. ప్రహరీ గోడ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు తప్ప ఆచరణలో మాత్రం నెరవేరడం లేదు. ప్రహరి గోడ లేక పాఠశాల ఆవరణలోకి గేదెలు, పశువులు, పందులు, కుక్కలు, సంచరిస్తున్నాయి.
విద్యార్థులు సమస్యను పరిష్కరించాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం బొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ ఉన్న ప్రహరి గోడ నిర్మించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గ్రామానికి వచ్చే ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నారు.
ప్రహరి గోడ నిర్మిస్తామని ప్రజా ప్రతినిధులు హామీ ఇస్తున్నార తప్ప అమలు పరచడం లేదు. ప్రహరి గోడ లేకపోవడంతో బొంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నర్ లో వివిధ వ్యర్థ పదార్థాలు ఉండడమే కాకుండా ఆ సాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రహరి గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలో ఉన్న కులాయి కనెక్షన్లను, లను ధ్వంసం చేయడమే కాకుండా ప్లాస్టిక్ ట్యాంకులను కూడా ధ్వంసం చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
వెంటనే పాఠశాలకు ప్రహరి గోడ నిర్మించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు దండ్రులు కోరుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రహరీ గోడ లేక పాఠశాల ఆవరణ లోకి జంతువులు, పశువులు, వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఎన్నికల సమయంలో ప్రహరీ గోడ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఇప్పటికైనా మంజూరు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నిధులు మంజూరు చేయాలి
గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరి గోడ మంజూరు చేయాలని గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవిస్తున్నాం. ప్రహరీ గోడ మంజూరు చేస్తామని చెప్పుతున్నారు కానీ నిధులు మంజూరు చేయడం లేదు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.
దత్తు రావు, గ్రామస్తుడు, బొంపల్లి గ్రామం
త్వరలోనే నిధులు మంజూరు చేస్తాం
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం బొంపల్లి గ్రామంలో ఉన్నత పాఠశాల కు ప్రహరి గోడ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలోనే ప్రహరి గోడ నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయి.
రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి, కామారెడ్డి