16-10-2025 01:17:02 AM
హైదరాబాద్,అక్టోబర్ 15(విజయక్రాం తి): ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో చెన్నై బ్లిట్జ్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. వరుస పరాజయాలతో సతమతమైన ఆ జ ట్టు తాజాగా అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై విజయం సాధించింది. గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్ 3 సెట్ల తేడాతో గెలిచింది. ఇరు జట్లు చెరొక సె ట్ గెలుస్తూ వెళ్ళడంతో ఐదో సెట్ మ్యాచ్ డిసైడర్‌గా మారింది.
చివరికి చెన్నై బ్లిట్జ్ పైచేయి సా ధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. చెన్నై జట్టులో జెరోమి వినీత్, అశ్విన్ రాజ్, ఆదిత్య రానా, సూర్య ఆకట్టుకున్నారు. మిడిల్ జోన్ లో సమీర్ చౌదరి, ఆదిత్య రారా వేగంగా కదులుతూ తెలివైన పాస్‌లు అందించారు. చెన్నై జట్టుకు ఇది మూడో విజయం కాగా అహ్మదాబాద్‌కు రెండో ఓట మి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై మీటియర్స్ అ గ్రస్థానంలో ఉండగా.. అహ్మదాబాద్ మూ డో ప్లేస్‌లోనూ, చెన్నై ఆరో స్థానంలోనూ కొనసాగుతున్నాయి.