12-05-2025 02:38:27 AM
న్యూఢిల్లీ, మే 11: ‘భారత్, పాక్ దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం. కశ్మీర్ విషయంలో పరిష్కారాన్ని మీరు కనుక్కోగలిగితే.. మీతో కలిసి పనిచేస్తాను’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో వెల్లడించారు.
ప్రస్తుత సంఘర్షణతో మరణాలు, విధ్వంసం తప్పా, ఏమీ ఉపయోగం లేదని భారత్, పాక్‌లోని శక్తిమంతమైన నాయకత్వాలు అర్థం చేసుకొని కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. ట్రంప్ తన తొలివిడత పాలనలోనూ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆస్తకిచూపారు.
నాటి పాక్, భారత్ ప్రధానుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ, న్యూఢిల్లీ మూడోపక్షం జోక్యాన్ని సున్నితంగా తిరస్కరించింది. దీంతో ట్రంప్ ఈ విషయంలో పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు.