15-09-2025 05:41:21 PM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్
ఖానాపూర్,(విజయక్రాంతి): అధికారులు పర్యవేక్షిస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వేగవంతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు .ఈ సందర్భంగా లబ్ధిదారులకు నిధులు త్వరగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.