calender_icon.png 13 May, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుల్వామా దాడి మా పనే

12-05-2025 02:40:43 AM

అంగీకరించిన పాక్

న్యూఢిల్లీ, మే 11: ఉగ్రవాదంపై తమకు సంబంధం లేదన్న పాక్ నేతల బుకాయింపులు కాకమ్మ కబుర్లేనని తేలిపోయింది. కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబుదాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించడంతో ఈ విషయం స్పష్టమైంది. పుల్వామా దాడికి తామె కారణమని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రెస్‌మీట్‌లో అంగీకరించాడు.

ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో డీజీఐఎస్‌పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి, నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. పాక్ గగనతలం, భూభాగం, జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే, వాటిని ఎదుర్కొనేందుకు రాజీపడం. మా దేశ ప్రజల కీర్తి మొత్తం భద్రతా దళాల్లోనే ఇమిడి ఉంది.

మేము ఎప్పుడూ దాన్ని నిలబెట్టుకుంటాం. పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించా. మా కార్యదక్షత.. వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించాం’ అని వ్యాఖ్యానించారు. ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యాలతో పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. నాడు పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ ఎంత బుకాయించినా.. తాజాగా వాయుసేనాధికారి వ్యాఖ్యలతో నిజం బయటపడింది.