calender_icon.png 15 September, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో వ్యవసాయ కూలీ మృతి

15-09-2025 05:17:52 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన కర్రెశంకరయ్య (50) అనే వ్యవసాయ కూలీ సోమవారం మధ్యాహ్నం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లో భాగంగా తలుపు బిగిస్తుండగా చేతికి విద్యుత్ వైర్ తగిలి పట్టేసింది. గ్రామస్తులు కర్రతో కొట్టిన ఫలితం లేకుండా పోయింది. కింద పడిపోయిన శంకర్ ను హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శంకర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు శంకర్ కు భార్య, కూతురు ఉన్నారు.